ఆంధ్రప్రదేశ్ లో రోజూ వేల సంఖ్యలో టెస్టులు నిర్వహిస్తున్నా కూడా కరోనా కేసుల వ్యాప్తి తగ్గుముఖం పట్టట్లేదు. ప్రతిరోజు వందల మందిని గుర్తించి జనావాసాల నుండి దూరం చేస్తున్నా వైరస్ ఏదో ఒక రీతిలో ఇంకా వ్యాప్తి చెందుతూనే ఉండడం రాష్ట్ర ప్రజలందరిని కలవరపెడుతుంది. ఏపీలో కరోనా ప్రభావం తగ్గిన జాడ అయితే అయితే కనిపించడం లేదు. శుక్రవారం ఉదయం 9 గంటల నుండి శనివారం ఉదయం 9 గంటల వరకు 22,371 పరీక్షించగా వారిలో 390 పాజిటివ్ కేసులు వచ్చాయి.

 

ఇదిలా ఉండగా మొత్తం రాష్ట్రంలో 491 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు 83 మంది మరియు విదేశాల నుండి వచ్చిన వారు 18 మంది ఉన్నారు. ఇక ఇందాక మనం చెప్పుకున్నట్లు ఏపీ లో 24 గంటల్లో మన రాష్ట్రాంలో చేసిన పరీక్షలు తద్వారా నమోదు అయిన కేసులు 390. మొత్తం కలుపుకుంటే 491.

 

మన రాష్ట్రంలో ఉన్న వారితోనే చచ్చిపోతుంటే ఇతర రాష్ట్రాల నుండి మరియు విదేశాల నుండి వచ్చి ఇంకా పరిస్థితిని తీవ్రం చేస్తున్నారని పలువురు ఆందోళన చెందుతున్నారు.

 

అలాగే వైరస్ మహమ్మారి కారణంగా 24 గంటల్లో ఐదుగురు మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వల్ల మరణించినవారి సంఖ్య 101 కి పెరిగింది. ఇలా కరోనా మరో మైలు రాయిని కూడా దాటింది. దీంతో కరోనా కారణంగా రాష్ట్రంలో చనిపోయిన వారి సంఖ్య మైలు రాయి దాటినటలైంది. గత 24 గంటల్లో చనిపోయిన వారిలో కృష్ణాజిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, గుంటూరులో ఒకరు మరణించారు.

 

ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 6,620 కేసులు నమోదు కాగా వారిలో 3,203 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 3,316 మందికి చికిత్స పొందుతున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: