ఏపీలో జగన్ పరిపాలన ఏడాది పూర్తి చేసుకుంది. తన ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీతగా భావిస్తున్న జగన్ వాటి అమలుపైనే ఎక్కువగా దృష్టి సారించారు. అదే సమయంలో తనదైన మార్కు కనిపించేలా ప్రయత్నిస్తున్నారు. అంతే కాదు.. రాజకీయంగాను ప్రత్యర్థులకు అందని ఎత్తులు వేస్తున్నారు. ఆ ఎత్తుల్లో సీనియర్ మోస్ట్ పొలిటిషియన్ గా తనకు తాను బిరుదు ఇచ్చుకునే చంద్రబాబు చిక్కుకుపోతున్నారు.

 

 

జగన్ ఎత్తులు ఎంత షార్ప్ గా ఉంటున్నాయంటే.. వీటిని ఎదుర్కోవడం చంద్రబాబు వల్ల కాదని.. ఆయన అనుంగు పత్రికాధిపతి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా తేల్చి పారేశారు. ముఖ్యమంత్రిగా జగన్‌ నుంచి ఎదురవుతున్న సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కోవడం తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు చాలెంజ్‌గా మారిందంటున్నారు రాధాకృష్ణ. సంప్రదాయ రాజకీయాలకు అలవాటుపడిన తెలుగుదేశం పార్టీకి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబుకు ఈ తరహా గెరిల్లా దాడులను ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదనిపిస్తోందంటూ నిష్టూరమాడారాయన.

 

 

అంతేనా.. జరుగుతున్న పరిణామాలను మదింపు చేసుకుని తెలుగుదేశం పార్టీ తమ సిలబస్‌ను మార్చుకోవలసిన అవసరముందని తేల్చి చెప్పేశారు. నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్‌గా హిట్‌లిస్టులో ఉన్నవారిని జగన్‌ టార్గెట్‌ చేసుకుంటూ పోతుండగా.. ఆవేదన, ఆక్రోశం వ్యక్తంచేయడం చంద్రబాబు వంతు అవుతోందంటూ తన వంతు ఆక్రోశాన్ని వెలిబుచ్చారు ఏబీఎన్ ఆర్కే.

 

 

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు తమిళనాడు రాజకీయాలను ఇప్పటికే మరిపించాయని... రాజకీయాలలో హుందాతనాన్ని ఆశించేవారు సిగ్గుపడే పరిస్థితులు తలెత్తాయని ఇప్పుడు ఏబీఎన్ ఆర్కే పత్తిత్తు కబుర్లతో పాపం తెగ బాధపడిపోతున్నారు. అంతేకాదూ.. ఓయ్ చంద్రబాబూ... ఏం చేస్తున్నావ్.. నువ్వు కూడా ముల్లును ముల్లుతోనే తీయ్యి.. జగన్‌ను జగన్ రూట్ లోనే ఎదుర్కో అంటూ చంద్రబాబుకు రాజకీయం నేర్పే ప్రయత్నం చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: