ప్రజల కష్టాలతో నేరస్దులకు పనిలేదు.. ముఖ్యంగా దోచుకునే దోపిడి దొంగలకు, సైబర్ నేరస్దులు అయితే అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు.. ఏ మాత్రం ఎమరుపాటుగా ఉన్నా ఎన్ని దోచుకోవాలో ఆన్ని రకాలుగా దోచుకుంటున్నారు.. ఇందుకు గాను ఎన్నో మార్గాలను ఈ నేరస్దులు ఎన్నుకుంటున్నారు..

 

 

ఇకపోతే ఇప్పుడు మరో కొత్తరకం దోపిడీ మొదలైంది. అదేమంటే దేశంలోని మహానగరాలైన హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, చెన్నై లోని స్థానికులందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించ బోతున్నట్టు ప్రభుత్వ అధికారిక అడ్రస్‌ను పోలిన మెయిల్‌ నుంచి ముందుగా ఒక సందేశాన్ని పంపిస్తారట. ఒకవేళ ఎవరైనా ఇది నిజమని నమ్మి వారు పంపిన మెయిల్‌ను ఒపెన్ చేయగా, వైరస్‌తో కూడిన ఫైల్స్‌ను యూజర్‌ ఖాతాలోకి చొప్పించి డేటా చౌర్యానికి పాల్పడుతున్నారట... ఇక ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఈ తరహా మోసాల నుంచి అప్రమత్తంగా ఉండాలని  హెచ్చరించింది..

 

 

ఈ నేరగాళ్లు ముఖ్యంగా వ్యక్తిగత ఈ-మెయిల్‌ ఖాతాదారులు, వ్యాపార సంస్థలే లక్ష్యంగా డేటా చౌర్యానికి పాల్పడుతున్నారట.. ఇకపోతే వీరి వద్ద ఇప్పటికే సుమారు 10 లక్షల ఈ-మెయిల్‌ అడ్రస్‌లు ఉన్నాయని, డేటా చౌర్యానికి సంబంధించిన కార్యకలాపాలు ఆదివారం నుంచి ప్రారంభం కావచ్చని అధికారులు పేర్కొంటున్నారు..

 

 

ముఖ్యంగా కొత్త ఐడీల నుంచి వచ్చే ఈ-మెయిల్స్ ను , కొత్త నంబర్ల నుంచి వచ్చే సందేశాల్ని, సోషల్‌ మీడియాలో అనుమానాస్పద లింకులను ఖతాదారులు తెరువవద్దని. సూచిస్తున్నారు. ఒకవేళ సైబర్‌ నేరగాళ్లు ncov2019@gov.in తరహా ఈ-మెయిల్‌ ఐడీలను కూడా వాడవచ్చని కాబట్టి ఇలాంటి వాటి బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు..

 

 

ఇక సైబర్ నేరగాళ్లు ఇలా రోజుకో కొత్తరకమైనా మోసాలతో అప్‌డేట్ అవుతుంటే.. ప్రజలు బలహీనులుగా మారి వీరిబారినపడి పూర్తిగా నష్టపోయాక పోలిసు స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు.. చదువులేని వారికంటే ఈ మోసాలబారిని విద్యాధికులే ఎక్కువగా పడటం విచారకరం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: