చైనా ప్రపంచదేశాల మీద ఆదిపత్యం చెలాయించాలని చేస్తున్న ప్రయత్నాలు ఈనాటివి కాదట.. తన విషపు ఆలోచనలతో ప్రపంచాన్నే ప్రమాదంలో పడవేస్తున్న చైనా తాజాగా అది పుట్టించిన కరోనా వైరస్‌తో అందరి దృష్టిలో పడింది.. ఇక ఈ వైరస్ నేపధ్యంలో అమెరికా, చైనాలు బద్ధ శత్రువులుగా మారాయి.. ఇక్కడ అమెరికా, భారత్‌ల మధ్య సంత్సబంధాలు నెలకొంటున్న నేపధ్యంలో ఈ రెండు దేశాల వల్ల తాను ఎక్కడ ప్రమాదంలో పడుతుందో అని కుట్రలు చేస్తూ భారత్ పై కక్షపెంచుకుంది.. ఈ నేపధ్యంలో మన సైనికులను ఇరవై మందిని చంపి పరోక్షంగా మనదేశానికి హెచ్చరికలను జారిచేసింది..

 

 

అంతే కాకుండా చైనా పాక్‌తో కలిసి.. నానాటికీ అణ్వస్త్ర సామర్థ్యాన్ని పెంచుకుంటూ, చిన్న దేశాలకు అణు పరికరాలను, పరిజ్ఞానాన్ని అందించాలని భావిస్తున్న ఇండియా ఆలోచనలకు గండి కొట్టాలని కుయుక్తులు పన్నుతున్నాయి. ఇదే కాకుండా ఇప్పటి వరకు భారత్‌కు అనుకూలంగా ఉండే మిత్ర దేశాల‌ను చైనా ప‌క్కాగా ప్లాన్ వేసి త‌న‌వైపు తిప్పుకునేందుకు ముమ్మురంగా ప్రయత్నాలు చేస్తుంది.. ఈ క్రమంలో భార‌త్‌కు చిర‌కాల‌ మిత్ర దేశమైన బంగ్లాదేశ్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న దాదాపు 5,161 ర‌కాల‌ ఉత్పత్తులపై 97 శాతం సుంకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్‌ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. లఢక్‌ ఘర్షణలు జరిగిన మరుసటి రోజే చైనా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

 

 

ఇక ఇటీవ‌ల నేపాల్ సైతం భారత్‌లోని మూడు భూభాగాలను తమవిగా పేర్కొంటూ కొత్త మ్యాప్‌ను రూపొందించగా, ఆ మ్యాప్‌కు నేపాల్ పార్లమెంట్ ఆమోద‌ముద్ర కూడా వేసింది. దీని వెనుక కూడా చైనా హస్తం ఉన్నట్లు నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో భారత్‌తో సత్సంబంధాలు కలిగిన దేశాలను దూరం చేసి త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డానికే చైనా ఎత్తుగ‌డ‌లు వేస్తున్న‌ద‌ని అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌పై ప‌ట్టున్న నిపుణులు కూడా విశ్లేషిస్తున్నారు..

 

 

ఇప్పటికైనా భారత ప్రజలు మేల్కొని చైనా పై యుద్దాన్ని ప్రకటించి, ఆ వెధవగాడు తయారు చేసిన వస్తువులు కొనకుండా ఉంటే కొంతవరకైనా ఆ డ్రాగన్ కంట్రీకి బుద్ధిచెప్పిన వారమవుతామని చాలమంది అభిప్రాయపడుతున్నారట..  
   

మరింత సమాచారం తెలుసుకోండి: