తెలంగాణా రాజకీయాల్లో కేటిఆర్ గురించి చెప్పాల్సిన అవసరమా లేదు. రాజకీయంగా ఆయన విపక్షాలను ఎదుర్కొనే తీరు గాని ఆయనను ఆయన మార్చుకుని ముందుకు నడుస్తున్న తీరు గాని ఉద్యమ పార్టీ గా ఉన్న తెరాస ని ని నేడు రాజకీయ పార్టీ గా ఆయన పూర్తి స్థాయిలో మార్చిన తీరు గాని అన్నీ కూడా ఒక సంచలనమే. సిఎం గా కేసీఆర్ ఉన్నా సరే అంతా కేటిఆర్ చూసుకుంటారు అని చాలా మంది అంటారు. తెరాస ఉద్యమ పార్టీ అని అనే వారు. కాని అధికారంలోకి వచ్చిన తర్వాత తెరాస పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసింది మాత్రం కచ్చితంగా కేటిఅర్ అనే సంగతి చాలా మందికి తెలియదు. 

 

పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కేసీఆర్ సిఎం గా ఇబ్బంది పడుతున్న తరుణంలో అన్ని విధాలుగా కేసీఆర్ కి సహకారం అందించే వారు కేటిఆర్ అని చెప్పాలి. రాజకీయంగా వస్తున్న ఇబ్బందులు అన్నీ కూడా ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ ఆయన ముందుకు వెళ్ళారు. ఇప్పుడు మంత్రి గా కూడా అదే విధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా కేటిఆర్ ముందుకి సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఎన్నో విజయాలు సాధించారు. కేసీఆర్ కూడా సాధించలేని విజయాలు సాధించారు. క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం ఒక ఎత్తు అయితే పార్టీని బలోపేతం చేయడానికి స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడం మరో ఎత్తు. 

 

ఇక స్థానిక సంస్థల్లో అయినా సరే మరో ఎన్నికల్లో అయినా సరే తెరాస విజయం సాధించింది అంటే దాని వెనుక కచ్చితంగా కేటిఆర్ కృషి ఉంది అనేది వాస్తవం. పార్టీలో ఇప్పుడు అన్నీ కేటిఆర్ అని అంటారు ఆయన గురించి తెలిసిన వాళ్ళు. ఆ విధంగా తండ్రికి తగ్గ తనయుడు గా ఆయన నిలబడ్డారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: