ఆంధ్రప్రదేశ్ లో  తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ సిఎం ఆంధ్రుల ఆరాధ్య దైవ౦ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సాధించిన విజయాలు ఆయన నమోదు చేసిన ఘనతలు అన్నీ కూడా ఒక సంచలనం అనేది వాస్తవం. అయితే ఆయన వారసులు గా ఉన్న ఆయన కుమారుల్లో ఆ ఘనతలను ఎవరూ కూడా దాదాపుగా అందుకోలేదు అనే చెప్పాలి. ఇక అది పక్కన పెడితే ఆయన సినీ వారసుడిగా పక్కన పెట్టి రాజకీయ వారసుడిగా హరికృష్ణ పైకి వస్తారు అని చాలా మంది భావించారు. 

 

అయితే పార్టీలో ఉన్న కొన్ని శక్తుల కారణంగా ఆయన పైకి రాలేకపోయారు అని అంటారు. పార్టీలో ఉన్న కొన్ని శక్తులు ఆయనను పైకి రానీయ లేదు అనే వ్యాఖ్యలు ఇప్పటికి కూడా వినపడుతూనే ఉంటాయి. చంద్రబాబు లాంటి శక్తిని ఎదుర్కొని ఆయన పార్టీ ని ముందుకు నడపలేదు అని చాలా మంది కామెంట్ లు చేస్తూ ఉంటారు. చంద్రబాబు కి ఉన్న ఇమేజ్ పక్కన పెడితే హరికృష్ణ కు అప్పుడు పార్టీ లో గాని ప్రజల్లో గాని చాలా మంచి ఇమేజ్ ఉంది అనే విషయం చాలా మందికి తెలియదు. హరికృష్ణ ప్రతీ విషయంలో కూడా అప్పుడు తండ్రి కి అండగా నిలబడ్డారు అనే సంగతి తెలిసిందే. 

 

అన్న టీడీపీ అని ఒక పార్టీని పెట్టడం ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబు వైపు నిలబడటం జరిగాయి.   అయితే ఆయన రాజ్యసభ సభ్యుడి గా మాత్రం ఆకట్టుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన చేసిన ప్రసంగానికి మంచి స్పందన వచ్చింది అప్పట్లో అని చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన లేరు. ఆయన వారసత్వాన్ని ఎన్టీఆర్ నిలబెడుతున్నాడు అని అంటారు. తండ్రి కి మించిన తనయుడు అని వ్యాఖ్యానిస్తూ ఉంటారు నందమూరి అభిమానులు టీడీపీ కార్యకర్తలు.

మరింత సమాచారం తెలుసుకోండి: