అమ్మ 9 నెలలు మనల్ని మోస్తుంది.. కానీ నాన్న ? జీవితాంతం మనల్ని మోస్తూనే ఉంటాడు. ఎంత కష్టం వచ్చిన.. ఎంత నష్టం వచ్చిన బిడ్డకు కావాల్సింది తెచ్చి పెడుతాడు. బిడ్డకు కష్టం అంటే తెలియకుండానే కష్టపడి పెంచుతాడు. తనకు కావాల్సినవి అన్ని త్యాగాలు చేసి కన్నబిడ్డల కోరికలు తీరుస్తాడు. 

 

IHG

 

నాన్నంటేనే ఓ ధైర్యం, నాన్నంటే బాధ్యత, ఓ భద్రత, భరోసా అన్నింటికీ మించి త్యాగానికి మారుపేరు నాన్న. కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు నాన్న. జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తూ వాళ్ల సుఖం కోసం రక్తం చిందిస్తాడు. ఈ క్రమంలో తన అవసరాలు, ఆరోగ్యం అన్నింటినీ పక్కనబెడతాడు.

 

IHG's Day - Chicago Tribune

 

పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసే నాన్న.. వాళ్లు ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఎంతో సంతోషపడతాడు. పిల్లలు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు. అలాంటి నాన్నను గౌరవించుకోవాలనే భావనతో వచ్చిందే ‘ఫాదర్స్ డే’. ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారంను ఎంతో ఘనంగా ఫాదర్స్ డే నిర్వహిస్తారు. 

 

IHG's Day to all dads - The <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SUNDAY' target='_blank' title='sunday-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>sunday</a> Guardian Live

 

తండ్రి మనల్ని తన కష్టం లేకుండా పెంచుతాడు.. కానీ అతని సంతోషం వెనుక ఉన్న కష్టాన్ని మనమే గుర్తించాలి.. వారిని ఆనందపరచాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. పుట్టినప్పటి నుండి మనం ప్రయోజకులు అయ్యే వరకు మనల్ని వారు ఎంత కష్టపడి పెంచుతారో.. ప్రయోజకులు అయ్యాక మనం వారికీ చెయ్యి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం కూడా వారు వృద్దులు అయినప్పుడు వారికీ చెయ్యి అందించి చిన్నపిల్లాడిలానే చూసుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: