సూర్యగ్రహణం భూమికి మరియు సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి పార్శీకంగా గాని పూర్తిగా గాని కనబడక పోవటం వలన సూర్య గ్రహణం ఏర్పడుతోంది. ఈ ప్రక్రియను ప్రాచీన హిందూ సంప్రదాయానికి సంబంధించి సూర్య సిద్ధాంతం కూడా చెప్పబడింది. సూర్యగ్రహణం అమావాస్య నాడు మాత్రమే వస్తుంది. ప్రాచీన కాలంలో గ్రహణాలను అశుభ సూచికంగా భావించేవారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల ప్రజలు వీటిని అశుభ సూచకంగా నే  భావిస్తున్నారు. అకస్మాత్తుగా సూర్యుడు ఆకాశం నుండి మాయమై చీకటి కమ్ముకోవడం వలన ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతారు. అయితే ఇటీవల విజ్ఞానశాస్త్రం ప్రజలకు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఈ నమ్మకాలు చాలావరకు తగ్గాయి.

 

భూమిని చంద్రుడి యొక్క పూర్తి ఛాయా అనగా పూర్తి నీడ పడిన తర్వాతనే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అందుచేత సంపూర్ణ సూర్య గ్రహణ భూమ్మీద ఎక్కడైనా సరే చాలా అరుదు. సంపూర్ణ సూర్యగ్రహణం చూడ దలిచినవారు ఆ గ్రహణం పట్టే ప్రదేశాలు సదూరంగా ఉన్నప్పటికీ అక్కడికి వెళ్లి ఆ గ్రహణాని తిలకిస్తారు.  ప్రస్తుతం వచ్చిన సూర్యగ్రహణం ప్రతి 18 సంవత్సరాల కి ఒకసారి వస్తుంది. ఇటువంటి తరుణంలో ఢిల్లీ, ఛండీగఢ్, ముంబయి, హైదరాబాద్, కోల్ కతా, బెంగళూరు పట్టణాల్లో ప్రజలు పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడనున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ కి సూర్యగ్రహణానికి సంబంధం గురించి శాస్త్రవేత్తలు కొత్త విషయాలు చెబుతున్నారు.

 

సూర్యగ్రహణం నాడు సూర్యుడి చుట్టు కిరీటాల్లాంటి ఆకారాలుంటాయని…కరోనా వైరస్ చుట్టూ ఉండే కిరీటాన్ని అవి పోలి ఉంటాయని చెబుతున్నారు. మరోపక్క ఈ గ్రహణం వల్ల సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడిన దేశంలో తూర్పు ప్రాంతంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఉండటంతో వైరస్ ప్రభావం అంతగా ఉండదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గ్రహణం తర్వాత దేశానికి సూర్యుడు ఉదయించే ప్రాంతం బంగాళాఖాతం కావటంతో పక్కనే రాష్ట్రం ఉండటంతో రాబోయే రోజుల్లో చాలా శుభాలు జరిగే అవకాశం ఉన్నట్టు గా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: