జనసేన పార్టీని అధికారంలోకి తీసుకు రావాలంటే ఏం చేయాలనే విషయంలో ఆ పార్టీ అధినేత పవన్ కు సరైన క్లారిటీ లేకపోయినా, ఆయన సోదరుడు నాగబాబు కు మాత్రం స్పష్టమైన క్లారిటీ వచ్చేసినట్టు గా కనిపిస్తోంది. పవన్ అధ్యక్షుడిగా ఉన్నా సరే, రాజకీయాల్లో అనుమానంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం నాగబాబు కు కూడా వచ్చినట్లుగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో అధికార పీఠం దక్కించుకోవాలంటే బీజేపీ మద్దతు తో పాటు, తెలుగుదేశం పార్టీపైన కఠినంగా ఉండకపోతే జనసేన పరిస్థితి మళ్లీ 2019 ఇలా మారుతుందని నాగబాబు గట్టిగా నమ్ముతున్నట్లు కనిపిస్తున్నారు. అందుకే ఓ సందర్భంలో అసలు ఏపీలో వైసీపీ, జనసేన, బిజెపి కూటమి తప్ప తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంది అంటూ ఆయన గట్టిగానే ప్రశ్నించారు. 

 

IHG


తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అమరావతిలో ఏపీ సీఎం జగన్ ను చిరంజీవి బృందం వెళ్లి కలిసిన తర్వాత అమరావతి రైతుల పేరుతో కొంతమంది ఆయనకు నిరసన తెలపడం, ఆ తర్వాత టీవీ డిబేట్ కార్యక్రమాల్లో చిరంజీవిని ఉద్దేశించి టిడిపి నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో నాగబాబు అప్పటి నుంచి టిడిపి పై తీవ్రస్థాయిలో విమర్శలు మొదలు పెట్టారు. అమరావతి రైతులు పేరుతో కొంతమంది టిడిపి నాయకులు ఈ వ్యవహారాలు చేస్తున్నారని, అసలు రాజధాని భూములు చిరంజీవి కి చెప్పి ఇచ్చారా అని ప్రశ్నించారు. 

 

IHG't <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TDP' target='_blank' title='tdp-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>tdp</a> Kapu leaders join Jana Sena?


టిడిపికి ఐదేళ్లపాటు అధికారం అప్పగిస్తే మొత్తం అవినీతి చేసి జనాలను మోసం చేసిందని, ఇప్పుడు ఆ పార్టీ ని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శిస్తున్నారు. టిడిపి పూర్తిగా మునిగిపోయిన నావని అందులో ఎవరు ఉండరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగబాబు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అంటూ జనసేన ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రకటించింది. కానీ టిడిపి ని విమర్శించే సాహసం జనసేన చేయలేకపోతోంది. టిడిపిని ఎప్పటికీ మిత్రపక్షంగా నే చూస్తున్నట్లుగా వ్యవహరిస్తోంది. అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారంలో జనసేన వైసీపీ తీరును తప్పు పట్టారు.


 నాగబాబు మాత్రం సమర్థించారు. ఇలా ప్రతి సందర్భంలోనూ జనసేన నిర్ణయాలకు వ్యతిరేకంగా నాగబాబు వ్యవహరిస్తూ టిడిపి ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. కానీ ఈ విషయంలో నాగబాబును కట్టడి చేసే ప్రయత్నాలు జనసేన చేయలేకపోతోంది. అందుకే నాగబాబు విమర్శిస్తుంటే జనసేన టీడీపీ కి మద్దతుగా వ్యవహరిస్తూ వస్తోంది. నాగబాబు రూట్ లోనే పవన్ ముందుకు వెళితే జనసేన పార్టీ రాజకీయంగా మరింత బలపడుతుంది తప్ప ఇప్పటికీ ఆ పార్టీకి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అది తెలుగుదేశం పార్టీకి మేలు చేసినట్టు అవుతుంది అని జనసైనికులే వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: