టీడీపీ నాయకుడు విశాఖపట్నం జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి  చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయ దూకుడు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. అతి చిన్న వయసులోనే పాతిక సంవత్సరాల వయసులోనే ఎమ్మెల్యే కావడం 27 ఏళ్ళ వయసులోనే మినిస్టర్ అవ్వటం ఎక్కడా కూడా కష్టపడకుండా రాజకీయంగా అయ్యన్నపాత్రుడు రాజకీయాల్లో ఎదగటం జరిగింది. ఎన్టీఆర్ హయాంలో నుండి తెలుగుదేశం పార్టీలో కీలకంగా రాణిస్తున్న అయ్యన్నపాత్రుడు చాలా వరకు ముందు వెనకా ఆలోచించకుండా ఇష్టానుసారంగా మాట్లాడతారని చాలా సందర్భాలలో రుజువైంది. ఒకానొక టైములో పోలీస్ ఆఫీసర్ పై కూడా అయ్యన్నపాత్రుడు చేసుకున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడతాయి.

 

మాస్ లీడర్ గా ప్రజలతో కలిసి పోతూనే మరోపక్క కోపమొస్తే నోటికి ఎంత పడితే అంత మాట అనడం అయ్యన్నపాత్రుడు కి ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతోంది. రాజకీయంగా కష్టపడకుండా అయ్యన్నపాత్రుడు ఎదగగడంతో ఆ పొగరు, ఆ గర్వం వలన అనేక చిక్కుల్లో ప్రస్తుతం పడుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇదే ఎప్పుడు అయ్యన్నపాత్రుడు కి మైనస్ తెచ్చి పెట్టినట్లు చెప్పుకొస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా వ్యవహరిస్తూనే మరోపక్క ఎంపీగా కూడా పని చేయడం జరిగింది.

 

ఎప్పటి నుండో పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఉంటున్న అయ్యన్నపాత్రుడు ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు  ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని ఆలోచించారట. కానీ ఇంతలోనే ఇటీవల ఆమె మహిళా కమిషనర్ మీద నోరు పారేసుకోవటం తో చంద్రబాబు ఆ ఆలోచన నుండి విరమించుకున్నట్లు… దీంతో అయ్యన్నపాత్రుడు నోటి దూల వల్ల  ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి పోయినట్లు వార్తలు అందుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త తెలుగుదేశం పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: