ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం దాదాపు 213 దేశాలపై తీవ్రంగా ఉంది . ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ 80 లక్షల మంది కి సోకడం జరిగింది. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఐదు లక్షలకు దగ్గరలో ఉంది ఈ వైరస్ వల్ల చనిపోయిన వారి సంఖ్య. ఇక ఇండియాలో కూడా ప్రస్తుతం కరోనా వైరస్ చాలా ఉదృతంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా లాక్ డౌన్ నాలుగో దశ తర్వాత తీసుకున్న నిర్ణయాలు వలన దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ ఊహించని విధంగా బయటపడటంతో కేంద్రంలో మరియు వైద్యుల లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నాలుగు లక్షల దగ్గరలో సంఖ్య ఉంది.

 

అంతే కాకుండా దాదాపు 12 వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఇటువంటి తరుణంలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19కు సంబంధించి తాజా గణాంకాలను అందించే అంతర్జాతీయ సంస్థ ‘వరల్డో మీటర్‌’ ప్రకారం పలు ఆసక్తికర గణాంకాలు వెల్లడయ్యాయి. కోవిడ్-19 మరణాల్లో తొలి స్థానంలో అమెరికా ఉండగా…8వ స్థానంలో భారత్ ఉంది. ఇదిలా ఉండగా సౌత్ యూరప్ లో అతి చిన్న దేశం అయిన సాన్‌ మారినో కొవిడ్‌-19 మరణాలలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కానీ భారత్ మరణాల విషయంలో భారత్ 106 స్థానంలో ఉంది. ఇది ప్రతి 10 లక్షల మంది జనాభాకు సంభవించిన కొవిడ్‌-19 మరణాల లెక్క విషయంలో.   

 

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 మరణాల్లో తొలి 8 స్థానాల్లో ఉన్న దేశాలు (సంఖ్యా పరంగా)

 

అమెరికా( 1,20,688 )

బ్రెజిల్‌ (47869)

బ్రిటన్‌ (42288)

ఇటలీ (34515)

ఫ్రాన్స్‌ (29603)

స్పెయిన్‌ (27136)

మెక్సికో (19749)

భారత్ (12,573)

 

ప్రతి 10 లక్షల మంది జనాభాకు సంభవించిన మరణాల ప్రకారం…

 

సాన్‌ మారినో (1,238)

బెల్జియం (836)

అండోరా (673)

బ్రిటన్ (623)

స్పెయిన్‌ (580)

ఇటలీ (571)

స్వీడన్ (500)‌

ఫ్రాన్స్ (454)‌

అమెరికా (365)

నెదర్లాండ్స్‌ (355)

భారతదేశం (9)

మరింత సమాచారం తెలుసుకోండి: