రాజకీయ నాయకులు మీడియా ముందు మాట్లాడే సమయంలో సరిగ్గా చెప్పేది అర్థమయ్యే రీతిలో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పకపోతే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి. విమర్శ కూడా ప్రత్యర్థికి సరైన రీతిలో వెయ్యకపోతే అదే విమర్శ ప్రజలలోకి వెళ్లి తిరిగి ఎవరైతే విమర్శ చేశారో వారిపైనే సెటైర్లు పడే విధంగా పరిస్థితి మారుతోంది. ఇప్పుడు ఇదే జరిగింది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు అశోక్ బాబు విషయంలో. ఇటీవల రాజ్యసభ ఎన్నికలు జరిగిన సమయంలో జగన్ పార్టీని ఉద్దేశించి 151 సీట్లు రావటాన్ని బట్టి చూస్తే ఆయన మంచి ముఖ్యమంత్రి కాబట్టి సీట్లు రాలేదని వైసిపి పాలనకు కొలమానం కాదు అని విమర్శించారు.

 

రాజ్యసభ ఎన్నికల విషయంలో ఎవరు ఓటు వేశారు అన్న దాని గురించి అశోక్ బాబు మాట్లాడిన సమయములో ఈ విధమైన కామెంట్లు చేశారు. దీంతో అశోక్ బాబు చేసిన కామెంట్లు 151 సీట్లు జగన్ పరిపాలన చూసి వేయకపోయినా గాని చంద్రబాబు పరిపాలన పై వ్యతిరేకత…. చిరాకు వల్లన ఆయన పరిపాలనకు కొలమానంగా 23 సీట్లు ఇచ్చి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోబెట్టామాని జనాలు అశోక్ బాబు కి సెటైర్లు వేస్తున్నరు. ఎటొచ్చీ బాణం తిరిగి తన వైపే రావడం తో చంద్రబాబు పరువు పోయే విధంగా… జనాలు విమర్శలు చేయడంతో టీడీపీలో సీనియర్ నాయకులు అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలపై మండి పడుతున్నట్లు సమాచారం.

 

అసలు పరిపాలన గురించి ఎవరు మాట్లాడమన్నారు అని అశోక్ బాబు మీడియా ప్రస్తావన పై టిడిపిలో ఉన్న సీనియర్ నాయకులు మండిపడుతున్నారట. ఏది ఏమైనా మీడియా సమావేశంలో జగన్ పార్టీకి పంచ్ వేద్దామని భావించిన అశోక్ బాబు కి… తన వ్యాఖ్యలతో చంద్రబాబు కే పంచ్ వేసినట్టుంది అని పరిశీలకులు అంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: