ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో 4 చెల్లని ఓట్లు పడని సంగతి అందరికీ తెలిసిందే. అందులో ఒకటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని వేసింది. దీంతో ఒక్కసారిగా ఆదిరెడ్డి భవాని ఏపీ పొలిటికల్ సర్కిల్ లో పెద్ద హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఆమెపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆదిరెడ్డి భవాని కావాలని చేశారని కొందరు, లేదు ఆమె తెలుగుదేశం పార్టీని వీడి అవుతుందని మరికొందరు ఇంకా కొంతమంది అయితే లేదు ఆమె కొత్త కాబట్టి పొరబడి ఉంటారు అని ఇలా ఊహించని విధంగా ఎవరికి వారు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.

 

అయితే తనపై వస్తున్న వార్తల గురించి ఆదిరెడ్డి భవాని వివరణ ఇవ్వటం జరిగింది. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో ఎలా ఓటు వేయాలి అన్న దాని విషయంలో అసెంబ్లీ సిబ్బంది మొదట మాక్ పోలింగ్ నిర్వహించిన తాను ఎలక్షన్ సమయంలో టెన్షన్ పడ్డా అని తెలిపారు. ఒకటి అని వేయాల్సిన చోట టిక్ మార్క్ పెట్టాను అని వెల్లడించారు. ఈ విషయంలో తనదే పొరపాటు అని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో ఫస్ట్ టైం ఓటు వేసినట్లు అందుకే ఈ పొరపాట్లు జరిగినట్లు ఆమె వివరణ ఇచ్చారు. ఓటు వేసే సమయంలో టిక్ పెట్టే చోట.. సిబ్బందిని అడిగిన టైములో వారు ఓకే చెప్పారని దాంతో టిక్ పెట్టా అని వివరించారు.

 

ఈ విషయంలో అధ్యక్షుడు చంద్రబాబుకి కూడా వివరణ ఇచ్చినట్లు తాను పొరపాటు వల్లే… అలాగే అసెంబ్లీ సిబ్బంది కి తనకి జరిగిన కన్వర్జేషన్ లోపం వల్లే ఈ మిస్టేక్ జరిగిందని…, అసెంబ్లీ వ్యక్తి తనకు తెలియదు అని చెప్పి ఉంటే ఉన్న ఏజెంట్లను అడిగి డౌట్ క్లారిఫై చేసుకునేదాన్ని… తన లోపం మరియు అసెంబ్లీ సిబ్బంది రాంగ్ గైడెన్స్ ఇవ్వడంతో తాను కూడా తప్పుగా టిక్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో అసలు భవాని చెప్పిన దాంట్లో లాజిక్ లేదని పరిశీలకులు అంటున్నారు. అంతకుముందే మాక్ పోలింగ్ జరిగిన టైంలో.. రాజ్యసభ ఎన్నికలలో ఏ విధంగా ఓటు వెయ్యాలి అన్న దాని విషయంలో అసెంబ్లీ సిబ్బంది శిక్షణ ఇచ్చారు. అయినాగానీ సరిగ్గా సరైన టిక్ పెట్టె పాయింట్ వద్ద పొరపాటు అని ఆదిరెడ్డి భవాని అనటం అనేక అనుమానాలకు తావిస్తోందని విశ్లేషిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: