దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తుంది.. మనం చేస్తున్న అభివృద్ది పనులు మితగా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నారు.  అభివృద్దిలో మన రాష్ట్రం ప్రగతి పధంలొో కొనసాగుతుంది.. ఇప్పటి వరకు ఎవరూ ఇవ్వని రైతు బంధు పతకం మనం ఇస్తున్నాం.  సాగు నీటి ప్రాజెక్టులు కడుతూ రైతు కష్టాలన్నీ తీరుస్తున్నాం.. కానీ ఇవన్నీ ప్రతిపక్ష నేతలకు కనిపించడం లేదని.. ప్రతి చిన్న విషయాన్ని బూతద్దంలో చూపిస్తూ రాద్దాంతం చేస్తున్నారని అన్నారు మంత్రి ఈటెల. ఇక కరోనా  వైరస్‌ను కట్టడి చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. ప్రస్తుత సమయం పరస్పర ఆరోపణలు చేసుకొనే సమయం కాదని అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం మంత్రి ఈటల మీడియా సమావేశం నిర్వహించారు. శనివారం తెలంగాణ బీజేపీ జన సంవాద్ వర్చువల్ ర్యాలీ చేపట్టిన నేపథ్యంలో ఆ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు. 

 

కరోనా విషయంలో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏం జరుగుతుందో ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకులు ఓసారి సరిచూసుకోవాలని హితవు పలికారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్న ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసంబద్దంగా ఉందని అన్నారు. ఓ గల్లీ లీడర్‌‌లా మాట్లాడారు. కరోనా అనేది ప్రపంచ సమస్య. గుజరాత్‌లో కరోనా తీవ్రతపై ప్రధాని బాధ్యత వహిస్తారా? తెలంగాణలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం.

 

తెలంగాణలో కరోనా వ్యాప్తి చెందుతున్నప్పి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విషయాలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.  తెలంగాణలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం.  కరోనాపై అన్ని రాష్ట్రాల కన్నా ముందే తెలంగాణ అప్రమత్తమైంది. తెలంగాణ ప్రభుత్వం చర్యలపై కేంద్ర బృందాలు సైతం హర్షం వ్యక్తం చేశాయి అని ఈటల గుర్తు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: