చుట్టూ భగభగ మండే అగ్ని వలయాలు.. మధ్యలో ఒంటి కాలుపై తపస్సు చేసే మునులు, రుషులను సినిమాల్లో చూసుంటాం. కానీ, రాజస్థాన్​లో ఓ భాజపా పార్లమెంట్​ సభ్యుడు.. ఇంచుమించు ఇలాంటి సాధనే చేశారు. మండుటెండలో.. జ్వాలా వలయంలో నిలబడి యువతకు ఓ సందేశమిచ్చారు. ఏంటిదీ అంటారా? అయితే పూర్తి కథనం చదివేయండి...

 

విశ్వ యోగా దినోత్సవం సందర్భంగా రాజస్థాన్​లో ఓ భాజపా పార్లమెంట్​ సభ్యుడు అగ్ని యోగా సాధన చేశారు. ఓ పక్క ఎండ మండిపోతున్నా.. అగ్నివలయం నుంచి కదలలేదు ఆ ఎంపీ. అంతే కాదు... ఒళ్లంతా బురద పూసుకుని బురద స్నానం ఆచరించారు. జిమ్​లో వ్యాయామం చేసి ప్రజలకు ఫిట్​నెస్​పై అవగాహన కల్పించారు.

 

టోంక్ జిల్లా,​ సవాయ్​ మాధోపుర్ నియోజకవర్గం ఎంపీ సుఖ్​బీర్​ సింగ్​ జోనాపురియా.. రోజుకు దాదాపు 4 గంటల పాటు వ్యాయామం​, యోగా చేస్తారు. ఇలా చేసి కేవలం నాలుగు నెలల్లో దాదాపు 25 కిలోలు బరువు తగ్గారు. అందుకే, ఆయన పాటించిన ఫిట్​నెస్​ మంత్రాను ఈ తరం యువకులూ పాటించాలంటున్నారు. మనకంటూ మనం రోజుకో రెండు గంటల సమయాన్ని కేటాయించుకుని ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

 

ఇప్పటి వరకు స్కాములు చేసిన రాజకీయ నాయకుని చూశారు, బూతులు తిట్టుకున్న రాజకీయ నాయకుని చూశారు, కానీ ఈ విధంగా ఫిట్నెస్ గా ఉండాలి అంటూ అగ్ని యోగా సాధన చేస్తున్న ఎంపీను ఎవరు చూడలేదు ఇదే మొదటిసారి. దీనికితోడు బురద స్నానం చేస్తూ... అందులో ఉన్న గొప్పతనం చెబుతున్నారు. చుట్టూ మంటలు- మధ్యలో ఒంటికాలిపై పార్లమెంట్​ సభ్యుడు ను ఇప్పటివరకు ఇలా చేసిన రాజకీయ నాయకులే లేరు... ఒకవేళ తెలియకుండా మంత్రాలు పాటించే రాజకీయ నాయకుల ఉన్నప్పటికీ ఈ విధంగా బయటకు రాలేదు. ఏదైనా ప్రపంచ యోగా దినోత్సవం రోజు రాజకీయ నాయకులు ఇలాంటి ఫిట్నెస్ మంత్రాలు పాటించాలని ప్రజలకు చెప్పడం తో ఆరోగ్యకరమైన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: