కరోనా ప్రపంచాన్ని అతాలకుతలం చేసిన సంగతి తెలిసిందే.. ఎన్నో లక్షల మంది కరోనా బారిన పడి చనిపోయిన సంగతి విదితమే.. ఇకపోతే లాక్ డౌన్ పేరుతో ప్రజలను ప్రభుత్వం ఇళ్లకే కట్టిపడేసింది.. దీంతో రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజల జీవితాలు మాత్రం దయనీయంగా మారాయి.. వారి ఆకలిని తీర్చుకోవడానికి సినీ రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు.. ఎన్నో స్వచ్చంధ సంస్థలు కూడా తమ వంతు సాయన్నీ ప్రకటిస్తూ వస్తున్నారు.. 

 

 

కాగా, కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా ప్రభుత్వాలు సాగుతున్నాయి. సినీ ప్రముఖులు ప్రజలకు కరోనా రాకుండా జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు. చాలా మంది ప్రముఖులు ప్రజలకు తోచిన సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి పేదలకు స్వయంగానో లేదా విరాళాలను అందించో ప్రజల కళ్ళల్లో సంతోషాన్ని నింపుతున్నారు. ఎటు చూసినా కూడా జిల్లాల వారీగా భారీగా పెరుగుతూ వస్తుంది..

 

 

 

హైదరాబాద్‌లో రోజు విడిచి రోజు కార్యకలాపాలు సాగుతాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థను పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టం చేసారు ముఖ్యమంత్రి. కొన్ని నియమాలను ఆయా పాసింజర్స్ లేదా డ్రైవర్స్ పాటించాలని కోరారు.. కరోనా ప్రభావం తెలంగాణలో తగ్గడం మూలంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావం మళ్లీ ఊపందుకుంది.. తెలంగాణలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి.. కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో ఉద్ధృతంగా వ్యాపిస్తోంది.

 

 

తాజాగా 3,188 నమూనాలు పరీక్షించగా, 546 మందికి పాజిటివ్ అని తేలింది. వారిలో జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాలకు చెందినవారే 458 వరకు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,072 కాగా, ఇప్పటివరకు 3,506 మంది డిశ్చార్జి అయ్యారు. 3,363 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, గత 24 గంటల్లో తెలంగాణలో ఐదుగురు మరణించగా, కరోనా మృతుల సంఖ్య 203కి పెరిగింది. తాజాగా 154 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇంకా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉండటంతో మళ్లీ లాక్ డౌన్ పెరుగుతుందని తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: