రాజకీయాల్లో నేతల పార్టీ మార్పులు అనేవి సహజంగానే జరుగుతుంటాయి. ముఖ్యంగా ప్రత్యర్ధి పార్టీని వీక్ చేయాలనే ఉద్దేశంతో అధికార పార్టీలు ఎక్కువగా వలసలని ప్రోత్సహిస్తుంటాయి. అయితే ఈ వలసల వల్ల ఒకోసారి మేలు జరిగితే ఒకోసారి ఊహించని నష్టం జరుగుతుంది. అలా వలసలు అధికంగా ప్రోత్సహించి దారుణంగా నష్టపోయిన పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు....ఇష్టారాజ్యంగా ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం చేశారు.

 

వైసీపీని దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు జూనియర్, సీనియర్ నేతలనీ లాగేసుకున్నారు. ఇక దీనివల్ల ఆధిపత్య పోరు పెరిగి 2019 ఎన్నికల్లో టీడీపీకి డ్యామేజ్ జరిగింది. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మాత్రం వలసల విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకెళుతున్నారు. సొంత పార్టీ నేతలకు నష్టం జరగకుండా, వచ్చేవారి వల్ల పార్టీకు మేలు ఉండేలాగానే నడుస్తున్నారు.

 

అందుకే ఈ ఇతర పార్టీల నుంచే నేతలు తమ పార్టీలో చేరాలంటే పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ కండీషన్ పెట్టిన విషయం తెలిసిందే. ఆ కండీషన్ ప్రకారమే జగన్ టీడీపీ నేతలని చేర్చుకుంటున్నారు. అయితే ఈ కండీషన్‌తో పాటు జగన్ మరో ఊహించని కండీషన్ పెట్టుకున్నారట. కేవలం ప్రజాభిమానం ఉన్న నేతలనే పార్టీలో చేర్చుకోవాలని వలసల్లో కీలక పాత్ర పోషించే సీనియర్ నేతలకు చెప్పారట.

 

అందుకే ప్రకాశం జిల్లాలో కీలకంగా ఉన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అదే మాట మీద ఉంటూ ముందుకెళుతున్నారు. ఎవరిని పడితే వారిని పార్టీలోకి ఆహ్వానించడం లేదు. ఇప్పటివరకు వచ్చిన కరణం బలరామ్, శిద్ధా రాఘవరావులకు మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టే, పార్టీలోకి తీసుకొచ్చారు. ఇదే క్రమంలో తమ తమ నియోజకవర్గాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్య ప్రసాద్‌లని టార్గెట్ చేసి లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే వీరిలో ఏలూరి పార్టీ మారడం కష్టమని తెలిసిపోయింది. కానీ గొట్టిపాటి, అనగానిలే కాస్త డౌట్.

మరింత సమాచారం తెలుసుకోండి: