తెలుగుదేశం పార్టీ నాయకుడు అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 మార్చి విక్రయించిన కేసులో అరెస్టయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసులో ఆయన తో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి కూడా అరెస్టు కావడంతో ప్రస్తుత ఆధారాలను బట్టి కేసు ఉన్న కొద్దీ వారి మెడకు గట్టిగా ఉచ్చు బిగిస్తోంది అనే వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసు విషయంలో కీలక ఆధారాలను కీలక సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమైన పోలీసులు వాటితోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్నా ప్రతి ఒక్కరిని అరెస్టు చేయడానికి పోలీస్ శాఖ టైట్ ఫోకస్ పెట్టినట్లు వార్తలు అందుతున్నాయి.

IHG

ఇప్పటికే ఈ కేసు విషయంలో మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. వారి వివరాలు చూస్తే జలాధర కంపెనీ మేనేజర్ నాగేశ్వర్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసులో వీరే కీలకమని భావిస్తున్నారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు ఆయన కుమారుడు తో పాటు ప్రజెంట్ అరెస్టయిన ముగ్గురిని మొత్తం ఐదుగురు ని కలిపి అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలి అన్నీ రెడీ అవుతున్నారు.

IHG

మరోపక్క ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు అస్మిత్ రెడ్డిల బెయిల్ పిటీషన్ ను అనంతపురం తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఉన్న ఆధారాలను బట్టి చూస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కొడుకు ఈ కేసులో నుండి బయటపడటం కష్టమే అని అనంతపురం జిల్లా రాజకీయాల్లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: