పెట్రోల్ బంకులో  అటెండర్గా పనిచేసిన ఒక సాధారణ వ్యక్తి నుంచి ఏకంగా దేశం  గర్వించదగ్గ సంపన్నులుగా ఎదిగారు దిరుబాయి  అంబానీ. ఆ తర్వాత తన వారసులైన ముకేశ్ అంబానీ  అనిల్ అంబానీకి వేల కోట్ల ఆస్తులను పంచి పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తిని అంతకంతకూ పెంచుకుంటూ ప్రస్తుతం భారతదేశంలోనే సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో నిలువగా... ముఖేష్ అంబానీ మాత్రం ఎన్నో వ్యాపారాలు పెట్టి సరిగ్గా నిర్వహించలేక అసమర్థత తో  ఎన్నో నష్టాలు చవిచూశారు. ఏకంగా బ్యాంకులకు ముఖేష్ అంబానీ ఉన్న అప్పులకు  గానే తన ఆస్తులను అమ్మి అప్పులు తీసుకోవాలని ఆయనే స్వయంగా ఐపి పెట్టారు.  

 


 భారతదేశంలో ఎన్నో బ్యాంకులకు అనిల్ అంబానీ అప్పులు  ఉన్నారు. అదే సమయంలో అటు చైనా బ్యాంకు కి కూడా 700 మిలియన్ డాలర్లు కట్టాల్సి ఉంది. దీనిపై నిన్న లండన్ కోర్టులో విచారణ జరగ్గా..  తాను చైనా బ్యాంకులకు 700 మిలియన్ డాలర్లు కట్టలేను అంటూ తన వాదన వినిపించారు అనిల్ అంబానీ. ఈ నేపథ్యంలో 700 మిలియన్ డాలర్లకు బదులు 100 మిలియన్ డాలర్లను చెల్లించాలని కోర్టు తీర్పును వెలువరించింది.అర్కం ద్వారా  ఈ తీర్పును వెలువరించింది లండన్ కోర్టు. 

 


 అయితే అతి పెద్ద దేశభక్తుడు ప్రస్తుతం చైనాకు డబ్బులు ఎగ్గొట్టాడు అనే అని కొంతమంది అంటున్నారు. అయితే వ్యాపార వైఫల్యం కారణంగానే ఆయన ఇలా డబ్బులు చెల్లించలేక పోయారు కానీ బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుని విదేశాలకు తరలించి లేదు అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఏ దేశపు అయినా సరే అది ప్రజల సొమ్మే అవుతుందని.. అంటున్నారు విశ్లేషకులు. అయితే తప్పు చేసినవాడు ఎక్కడైన  తప్పే అని.. అంతే తప్ప ఆయన దేశభక్తుడు అనే ప్రొజెక్ట్  చేసుకోవడం చైనా మానేస్తే బాగుంటుందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: