డ్రాగన్ కంట్రీ ఉన్న కొద్ది రెచ్చిపోతోంది. కరోనా కారణానికి కారకుడిగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే డ్రాగన్ కంట్రీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కరోనా వైరస్ నీ దీటుగా ఎదుర్కొని నిలబడిన భారత్ పై సరిహద్దుల విషయంలో వివాదం సృష్టించి ప్రపంచ దృష్టిని వేరే వైపు మార్చడానికి చైనా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. సరిహద్దు వివాదంలో ఇండియా కి చెందిన 20 మంది సైనికులను చైనా పొట్టన పెట్టుకోవటం తో  ఇండియా మరియు చైనా సరిహద్దుల్లో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో చైనా విషయంలో కొత్త వ్యూహం అమలు చేయడానికి కేంద్ర పెద్దలు రెడీ అయ్యారు.

 

ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్న అధికారులతో రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సమావేశంలో త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణె, నావికాదళాధిపతి అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌, వాయుసేనాధిపతి చీఫ్‌ మార్షల్‌ ఆర్‌.కె.ఎస్‌ భదౌరియా హాజరయ్యారు. చైనా సైన్యం దుస్సాహసాలకు గట్టిగా బదులివ్వడానికి సిద్ధంగా ఉండాలని భారత సైన్యానికి రాజ్‌నాథ్‌ సూచించినట్లు తెలుస్తోంది.

 

అంతే కాకుండా ఇకపై సరిహద్దుల వద్ద భిన్నమైన వ్యూహాత్మక విధానాలు పాటించాలని సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలపడం జరిగింది. రష్యా దేశానికి వెళ్లకముందు ఈ సమీక్ష సమావేశం నిర్వహించి ఇటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంతో… భారత్ మరియు చైనా మధ్య యుద్ధానికి రోజులు దగ్గరలో ఉన్నాయి అని అందరూ భావిస్తున్నారు. మరోపక్క భద్రతా బలగాల కోసం అత్యవసర నిధులను ఇదే సమయంలో కేంద్రం విడుదల చేయటం గమనార్హం. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: