రాజుగారు అంటే ఇపుడు అందరికీ గుర్తుకువచ్చేది నర్సాపురం ఎంపీ రఘురామక్రిష్ణంరాజు గారే. ఆయన ఎంపీ కావాలనుకుని ఎంతో ట్రై చేశారు. మొత్తానికి  అయిదేళ్ళకు  ఆయన కోరిక తీరింది. అయితే ఆయన ఈ మధ్యలో ఎన్నో పార్టీలు మారారు. చివరికి ఆయన వైసీపీ నుంచే గెలిచారు. గెలిచిన కొత్తల్లోనే ఆయనకూ వైసీపీ హై కమాండ్ కి చెడింది. ఆయన బీజేపీ వైపు వెళ్తున్నాడు అని వైసీపీ నేతలు అంటూంటే తాను జగన్ని ముప్పయ్యేల్ళు సీఎంగా చూడాలనుకుంటున్నానని రాజుగారు అంటున్నారు. కానీ ఆచరణలో మాత్రం ఆయన భారీ డైలాగులు, హాట్ హట్  మాటలు అటు జగన్ని ఇటు పార్టీని డ్యామేజ్ చేస్తున్నాయి.

 

ఈ క్రమంలో ఇక రాజుగారు వైసీపీలో ఉండలేకపోతున్నట్లే సీన్ ఉంది. ఆయనకు అక్కడ  ఉక్కబోత పెరిగింది. నిజానికి జగన్ ఆయన్ని వైసీపీ ఎంపీగా చూడడమే మానేశారని అంటున్నారు. ఆయన సైతం బీజేపీకి చేరువ కావాలని చూస్తున్నారని అంటున్నారు. అంటే రోగి కోరుకునేది, డాక్టర్ ఇచ్చే మందూ ఒకటే అన్నమాట. అయితే అది ఎపుడు అన్నదే ఇపుడు ప్రశ్న. అయితే ఎందుకు ఆలస్యం అన్నట్లుగా అది తొందరలోనే సాకారం అవుతుంది అంటున్నారు.

 

జగన్ పార్టీ దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది అంటున్నారు. షోకాజ్ నోటీసులు జారీ చేస్తుందని కూడా చెబుతున్నారు. దానికి సమాధానం ఎలా వచ్చినా కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఆ తరువాత ఎంపీ సభ్యత్వం మాత్రం అలాగే ఉంటుంది. మరి రాజు గారు కూడా ఇదే కోరుకుంటున్నారని అంటున్నారు.

 

లేకపోతే ఏపీలో అధికారంలో ఉన్న సొంత ప్రభుత్వంలో తనకు రక్షణ లేదని ఆయన కేంద్ర బలగాలు కోరుతున్నారు అంటే ఆయన జగన్ని నమ్మడం లేదనే కదా  అర్ధం అని వైసీపీ  అంటున్నారు. మరి నమ్మని చోట ఇక రాజకీయాలు ఎలా ఉంటాయి. కేంద్ర బలగాల మీద నమ్మకం ఉందంటే ఆయన బీజేపీ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. ఇక మరో వైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాజు గారి చేత చంద్రబాబు మాట్లాడిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి రాజుగారి కధ క్లైమాక్స్ కి వచ్చేసిందని ఈ పరిణామాలు తెలియచేస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: