ఇటీవల తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ESI కుంభకోణం విషయంలో అరెస్టయిన సంగతి అందరికీ తెలిసిందే. కార్మిక శాఖ గా ఉంటూ పేద వర్గాలకు అతి తక్కువగా ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన మందులు రేట్లను అడ్డగోలుగా పెంచి నియమ నిబంధనలు లేకుండా వ్యవహరించారు అని ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేయడం అందరికీ తెలిసిందే. కానీ ఆయన ఫారెస్ట్ అవ్వకముందు ఫైల్స్ ఆపరేషన్ చేయించుకున్నారని వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని కానీ పోలీసులు అడ్డగోలుగా తన భర్తను అరెస్టు చేసినట్లు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది.

 

ఇదిలాఉండగా ప్రజెంట్ అచ్చెన్నాయుడు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు అచ్చెం నాయుడికి చేసిన పైల్స్ ఆపరేషన్ తిరగబడినట్లు...రక్తస్రావం స్టార్ట్ అయినట్లు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆయనకి రక్తపోటుతో పాటు కాళ్ళు మరియు చేతులు తిమ్మిర్లు ఎక్కువగా వస్తున్నట్లు గుంటూరు జిజిహెచ్ వైద్యులు తెలిపారు. దీంతో పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు అదే విధంగా కుటుంబ సభ్యులలో ఆందోళన స్టార్ట్ అయింది.

 

ఈ నేపథ్యంలో బాబాయ్ అచ్చెన్నాయుడు ని వేరే కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆలోచిస్తున్నట్లు,  ఈ విషయంలో స్పెషల్ రిక్వెస్ట్ కోసం వైయస్ జగన్ తో భేటీ అవ్వాలని లేకపోతే పర్మిషన్ అయిన తీసుకోవాలని రామ్మోహన్ నాయుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయంలో కోర్టు ద్వారా అనుమతులు తీసుకుని మంచి ఆసుపత్రిలో జాయిన్ చేయాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంమీద చూసుకుంటే అచ్చెన్నాయుడు పైల్స్ ఆపరేషన్ తిరగబడింది అని, రక్తస్రావం బాగా జరుగుతుందని వార్తలు బలంగా వినబడుతున్నాయి. దీంతో అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: