తెలంగాణలోని జనగామ జిల్లా కరోనా తో వణికిపోతుంది. కొద్దీ రోజుల క్రితం ఆజిల్లాకు చెందిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి  కరోనా బారిన పడ్డారు ఇక అప్పటినుండి జనగామలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు అయితే జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఏకంగా 34 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో  అత్యధిక కేసులు నమోదైన జిల్లాల జాబితాలో రంగారెడ్డిని వెనక్కి నెట్టి జనగామ రెండో స్థానానికి ఎగబాకింది.
 
మరోవైపు టెస్టుల సంఖ్య ఎక్కువవుతుంటే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూపోతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 730 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క జిహెచ్ఎంసిలోనే 659కేసులు నమోదయ్యాయి. ఈరోజు మొత్తం 3297 శాంపిల్ టెస్టులు జరిగాయి. ఈ కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 7802 కు చేరింది. అందులో 3731మంది బాధితులు కోలుకోగా ప్రస్తుతం 3861కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఈరోజు కరోనా తో ఏడుగురు మరణించడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 210కి  చేరింది.
ఇదిలావుంటే ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 426000కు చేరగా 13200మరణాలు చోటుచేసుకున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: