కేరళలో రోజు రోజుకు భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో133 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇప్పటివరకు సింగిల్ డేలో ఇదే హైయెస్ట్. కాగా ఈరోజు మరో 93 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. ఈకొత్త కేసులతో కలిపి కేరళలో మొత్తం 3172కేసులు నమోదుకాగా అందులో 1490కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 1659మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా 21 మంది మరణించారు. 
ఇదిలావుంటే ఈరోజు కూడా దేశ వ్యాప్తంగా 15000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర లో 3870, ఢిల్లీ లో 3000, తమిళనాడులో 2532 కేసులు నమోదయ్యాయి. కాగా దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 426000కు చేరగా 13200మరణాలు చోటుచేసుకున్నాయి.
 
ఇక అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఢిల్లీ ,తమిళనాడును దాటేసి రెండో స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ లో ఇప్పటివరకు 59746కేసులు నమోదుకాగా తమిళనాడులో 59337 కేసులు నమోదయ్యాయి. ఈజాబితాలో మహారాష్ట్ర అగ్ర స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు అక్కడ 132075 కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: