సామాజిక వర్గాల లెక్కల ప్రకారం ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి. గతంలో ఈ లెక్కలు ఉన్నా, ఇప్పుడు మాత్రం ఈ లెక్కలు పక్కాగా అమలవుతున్నాయి. ఒకే సామాజిక వర్గానికి పదవులు అంటే ఇప్పుడు కుదరని. ఏ పదవి భర్తీ చేయాలన్నా, సామాజిక వర్గాల సమతూకం పాటించాల్సిందే. ఈ విధానాన్ని పాటించేవారికి రాజకీయాల్లో తిరుగు ఉండదు. ఈ విషయంలో వైసీపీ అధినేత సీఎం జగన్ పైచేయి సాధించారు. మాటలు చెప్పడమే కాకుండా, కొన్ని సామాజిక వర్గాలకు పెద్ద పీట వేసి జగన్ ప్రశంసలు పొందుతున్నాడు. ముఖ్యంగా ఎస్సీ ,బీసీ లకు పెద్ద పీట వేస్తూ, వారికి పదవుల్లో తగిన ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. జగన్ మంత్రి మండలిని చూసుకుంటే, ఈ విషయం బాగా అర్థమవుతుంది. తన మంత్రి మండలి ఏర్పాటులో సామాజికవర్గ సమతూకం జగన్ పాటించారు. 

 


ఈ విధంగా గతంలో ఏ ముఖ్యమంత్రి పాటించలేదనే చెప్పాలి. అక్కడితో ఆగకుండా నామినేటెడ్ పదవుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ, వారి అభ్యున్నతికి తాను ఎంతగా పాటునే పడుతున్నానో నిరూపించుకున్నాడు. ఇక ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఫెయిల్ అయినట్టుగా చెప్పుకోవాలి. ముందు నుంచి బిసిలు, ఎస్సీలు తనకు రెండు కళ్లు అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఆయన పదవుల విషయంలో మాత్రం వారిని పక్కన పెట్టడం, కేవలం తన సామాజిక వర్గానికి ఎక్కువగా పదవులు కేటాయించడం వంటివి జనాల్లోకి బాగా వెళ్ళింది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ వర్గాలు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దూరం అవడానికి కూడా అదే కారణం. 

IHG


కానీ జగన్ మాత్రం బాబు చేసిన తప్పు చేయకుండా, ముందు నుంచే జాగ్రత్తపడి ఆ సామాజిక వర్గాల మద్దతు కూడగట్టుకుని పైచేయి సాధించారనే చెప్పాలి. లోకేష్ కానీ, చంద్రబాబు కానీ పదే పదే బీసీలు. ఎస్సి సామాజిక వర్గాల అభ్యున్నతి గురించి పదే పదే చెప్పడం తప్ప, చేతల్లో వాటిని చూపించకపోవడం వంటివి చర్చగా మారాయి. అలాగే ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసినా వర్ల రామయ్యను పోటీకి దించడంతో ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారు. గతంలో టిడిపి రాజ్యసభ ఎన్నికల్లో సీట్లు గెలిచే అవకాశం ఉన్న సందర్భంలో, ఇతర సామాజిక వర్గాలకు పెద్ద పీట వేశారని, ఇప్పుడు ఓడిపోయే స్థానాల్లో వెనుకబడిన తరగతుల వారికి అవకాశం ఇవ్వడం చంద్రబాబు రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అని ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ సామాజికవర్గం సమతూకంలో జగన్ పై చేయి సాధించగా, చంద్రబాబు మరింతగా అపఖ్యాతిని మూటగట్టుకున్నారనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: