వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఆయన పార్టీలోనే ఉంటూ పార్టీ విధివిధానాలను తప్పుపడుతూ, అధినేత జగన్ వ్యవహారశైలిని ప్రశ్నిస్తూ, అనేక లోపాలను ఎత్తి చూపుతూ కొద్ది రోజులుగా హడావుడి చేస్తున్నారు. అంతేకాదు తన కాళ్లు వేళ్లు పెట్టుకుంటేనే తాను వైసీపీలో చేరానంటూ చెప్పడం, తనను చూసే జనాలు ఓటు వేశారు అంటూ మాట్లాడడం, ఇలా ఎన్నో సంచలన విషయాలు కొద్దిరోజులుగా  ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. దీనికి కౌంటర్ గా వైసీపీ ఎమ్మెల్యేలు ఆయనపై అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా లోని నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలంతా ఆయనపై అదేపనిగా విమర్శలు చేస్తున్నారు. 

IHG


అక్కడితో ఆగకుండా కొంత మంది కార్యకర్తలు విమర్శలు వైసీపీ పై విమర్శలు చేయడాన్ని తట్టుకోలేక రఘురామకృష్ణంరాజు దిష్టిబొమ్మలను దగ్ధం చేసి, ఆయన ఫ్లెక్సీలకు టమాటాలు,. కోడిగుడ్లతో కొట్టి నిరసన తెలియజేశారు.ఈ వ్యవహారం రఘురామకృష్ణంరాజుకు మరింత ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో ఆయన తనకు ప్రాణహాని ఉందని చెప్పడమే కాకుండా, ఈ విషయంపై లోక్ సభ స్పీకర్, జిల్లా ఎస్పీ లకు ఫిర్యాదు చేసి, కేంద్ర బలగాలతో తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. అలాగే తనకు వ్యతిరేకంగా ఆందోళనలు, ధర్నాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ.. ఆకివీడు, ఉండి, తాడేపల్లిగూడెం, ఆచంట పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఆ స్టేషన్ ఎస్ ఐ ల పైన చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.


 ఈ వ్యవహారంపై వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఎన్నికలకు రెండు వారాల ముందు పార్టీలో చేరిన రఘురామ కృష్ణంరాజు బాధ్యతను భుజాన వేసుకుని గెలిపించిన తమపై తిరిగి తమ పైన కేసులు పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం మరింత ముదురుతూ ఉండడం కలవరం పుట్టిస్తోంది. రఘురామకృష్ణం రాజు బీజేపీలోకి వెళ్లేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అంటూ వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: