కరోనా వైరస్ ఎవరి ద్వారా ఎలా వస్తుందో, ఏ మార్గంలో మనిషి పై అటాక్ చేస్తుందో అనే భయంతో జనం అల్లాడిపోతున్నారే గానీ దీని విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మాత్రం పాటించడం లేదు.. ఈ దశలో కరోనా వైరస్ తనపని తాను చేసుకుంటూ తీవ్రంగా వ్యాపిస్తుంది.. ఇప్పటికే దేశంలో కేసులు పెరుగుతుండటం, మరోవైపు కరోనా బాధితులతో పాటుగా, మిగతా ప్రజలను ఆనందపరిచే విధంగా ఈ వైరస్‌కు మందులు వచ్చాయని ప్రచారం జరుగుతుంది.. అదీగాక ఇప్పటి వరకు వైరస్ కట్టడికి ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా, దీని వ్యాప్తికి అడ్డుపడటం సాధ్యం కావడం లేదు. మాస్క్, సామాజిక దూరం, శానిటైజర్ వంటివి వాడుతున్నా కాటేస్తోంది.

 

 

ఇకపోతే ప్రస్తుత కాలంలో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదన్న విషయం తెలిసిందే.. అయితే నదీ తీరంలో స్నానఘట్టాల వద్ద ప్రజలు ఎక్కువగా స్నానాలు చేస్తుంటారు. ముఖ్యంగా రాజమండ్రిలోని గోదావరి నదిలో స్నానం చేసే వ్యక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రజలు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తారు కాబట్టి ఈ చర్య వల్ల కరోనా వ్యాపించే అవకాశం ఉంటుందని భావించిన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వినూత్నమైన ఆలోచన చేసింది.. ఇందులో భాగంగా ఇక నుండి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని స్నాన ఘట్టాలను మూసేస్తూ నిర్ణయం తీసుకుంది.

 

 

రోజు రోజుకు కరోనా తీవ్రత పెరుగుతున్న కారణంగా ఇకపై ఎవరూ కూడా గోదావరి నదిలో ఉన్న స్నాన ఘట్టాల వద్ద స్నానాలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.. కానీ మన ప్రజలు వింటారా అక్కడ కాకుంటే మరోచోట.. ఇలాంటి స్నానాలను ఆచరిస్తారు.. కాబట్టి ఒక రాజమండ్రిలోని గోదావరి నదిలో మాత్రమే కాదు ఇలాంటి స్నాన ఘట్టాలు ఉన్న ఆని చోట్ల కూడా ఈ నిర్ణయం అమలు చేస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: