గత వారం రోజులుగా చైనా - భారత్ మధ్య యుద్ధవాతావరణం కొనసాగుతున్న సంగతి అందరికీ విదితమే. దేశ సరిహద్దుల్లో చైనా తన సైన్యాన్ని ఉంచి యుద్ధానికి కాలుదువ్వుతుంది. ఒకవైపు అలా ఉంటే మరోవైపు బ్యాంకు ఖాతాల్లోకి చొరబడి డబ్బులు మాయం చేసే " సైబర్ యుద్ధాన్ని " కూడా చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది చైనా దేశం. దీనిపై అప్రమత్తమైన ప్రభుత్వం ముందుగానే అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది భారత ప్రభుత్వం. భారతదేశంలో సైబర్ భద్రతా వ్యవహారాలు చూసే ఈసీఆర్‌టీ- ఇన్‌ దీనిపై తగు హెచ్చరికలు జారీ చేసింది కూడా. ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో ఎవరైనా సాయం చేస్తామంటూ ప్రభుత్వ సంస్థలు, వ్యాపార సంఘాల పేరుతో తప్పుడు ఇ-మెయిల్స్ ను పంపిస్తున్నారని అందులో మీరు తెలియకుండా ఏదైనా సమాచారాన్ని అందిస్తే చాలా నష్టం జరుగుతుందని తెలియజేస్తోంది. సైబర్ రంగంలో ఇలాంటి వాటిని " ఫిషింగ్ " గా చెబుతారు.

 

ఆ దేశాల నుంచి సైబర్ దాడుల ముప్పు..

 

ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే పాకిస్తాన్, చైనా, ఉత్తర కొరియా లో నుంచి సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని జాతీయ సైబర్ భద్రత విభాగం మాజీ అధిపతి గుల్షన్ తెలియజేస్తున్నారు. అయితే ఈ దాడులు సామూహికంగా గాని, వ్యక్తిగతంగా కాని చేసే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. గూఢచర్యం, ఆర్థికం, సైనిక పరమైన కారణాలతో ఈ దాడులకు ఎగపడతారని ఆయన తెలుపుతున్నారు. ఈ కారణాలతో భారతదేశంలో అనేక విషయాల్లో గందరగోళం ఆందోళన జరపడం వారి రక్షణ ఉద్దేశమని కీలకమైన సమాచారాన్ని అపహరించడం కోసం వారి దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేస్తారని తెలియజేశాడు.

 

చైనా చేస్తున్న ఏర్పాట్లేమిటి ...?


ఇకపోతే చైనా ప్రభుత్వమే ప్రైవేట్ హ్యాకర్స్ ను సైబర్ దాడులను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. సైబర్ దాడులు చేయడం, అంతేకాకుండా వారి వ్యవస్థలపై ఎవరైనా దాడులు చేస్తే వాటిని ఎదుర్కోవడం కోసం విస్తృతమైన ఏర్పాట్లను చేస్తుంది చైనా దేశం. అయితే చైనా దేశం 2016 సంవత్సరంలో ని ప్రత్యేకంగా ఊహాత్మక మద్దతు దళం (స్ట్రేటజిక్‌ సపోర్ట్‌ ఫోర్స్‌-ఎస్‌ఎస్‌ఎఫ్‌) ని ఏర్పాటు చేసింది. ఎలక్ట్రానిక్ యుద్ధం తో పాటు... మానసిక యుద్ధాన్ని కూడా అనేక వ్యూహాలు రూపొందించడానికి సన్నాహాలు ఈ విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: