వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సెటిల్ మెంట్ జగన్ కోటరీ లోకి వచ్చినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు అందుతున్నాయి. గత కొంత కాలం నుండి రఘురామకృష్ణంరాజు ఏకంగా పార్టీ హైకమాండ్ ని టార్గెట్ చేస్తూ పార్టీలో ఉన్న కొంతమంది నేతల పై బహిరంగంగా మీడియా ముందు అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది. అంతే కాకుండా అసలు జగన్ అపాయింట్మెంట్ దొరకటం లేదని… ఆయన చుట్టూ ఉన్న మనుషులు జగన్ తో సమావేశం అవ్వకుండా అడ్డుకుంటున్నట్లు మీడియాలో వ్యాఖ్యలు చేయడం జరిగింది.

IHG

ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో కీలకంగా అవటంతో పాటు వైసీపీ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారటంతో ఈ విషయంలో రఘురామకృష్ణం రాజు కి మరియు జగన్ కి సన్నిహితంగా ఉండే ఓ టీవీ ఛానల్ యాంకర్ రంగంలోకి దిగినట్లు, రాజు గారి పంచాయతీ జగన్ గుమ్మంలోకి తీసుకెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ తో ఒక సారి భేటీ అవ్వాలని రఘురామకృష్ణంరాజు చేసిన ప్రయత్నాలకు సదరు టీవీ ఛానల్ యాంకర్… ఇద్దరికీ సమావేశం ఏర్పాటు చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటువంటి సమయంలో రఘురామకృష్ణంరాజు తనకి ప్రొటెక్షన్ కల్పించాలని వెస్ట్ గోదావరి ఎస్పీని లెటర్ ద్వారా పోరాటం మరోపక్క రాజకీయంగా సంచలనం సృష్టించింది.

IHG

తనకు ప్రాణహాని ఉందని జిల్లా రాజకీయ నాయకులు మరియు కార్యకర్తలు తనపై నీచంగా మాట్లాడుతున్నారని లెటర్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సదరు టీవీ ఛానల్ యాంకర్ ఆధ్వర్యంలో జగన్ తో రఘురామకృష్ణంరాజు భేటీ… ఏ విధమైన మార్పులు తీసుకు వస్తుందో అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: