అందరు ఎంతగానో ఎదురుచూస్తున్నా వన్ ప్లస్ 8, వన్ ప్లస్ 8 ప్రో ఈ రోజు సేల్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఫోన్లు అమెజాన్ ఇండియా, వన్ ప్లస్ ఇండియా అధికారిక వెబ్ సైట్లలో అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫోన్లలో వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999గా ఉండగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.59,999గా నిర్ణయించారు. ఎస్ బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 క్యాష్ బ్యాక్ లభించనుంది. 

 

 

వన్ ప్లస్ 8 స్మార్ట్ ఫోన్ లో 6.55 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారన్నారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ గానూ ఉందన్నారు. ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుందన్నారు. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ కూడా ఇందులో ఉందన్నారు.

 

 

వన్ ప్లస్ 8 ప్రోలో 6.78 అంగుళాల క్యూహెచ్ డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించినట్లు సమాచారం. దీని యాస్పెక్ట్ రేషియో 19.8:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ గానూ ఉందన్నారు. ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా ఇందులో అందించారన్నారు.

 


ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ గా ఉంది. దీంతో పాటు 48 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కూడా అందించారు. 8 మెగా పిక్సెల్ టెలిఫొటో సెన్సార్ తో పాటు 5 మెగా పిక్సెల్ కలర్ ఫిల్టర్ సెన్సార్ లను ఇందులో అందించారు. సెల్ఫీ ప్రియుల కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: