ఈ మధ్య కాలంలో మహిళలపై అనేక అఘాయిత్యాలు కొనసాగుతున్న సంగతి అందరికీ విధితమే. దీంతో ఆడపిల్లల్ని బయటికి పంపాలంటే తల్లిదండ్రులు భయంతో వణికి పోతున్నారు. అయితే తాజాగా జరిగిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. వసతి గృహాల్లో ఉన్న బాలికలకు గర్భం రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇలాంటి అమానుషం సంఘటన జరగడంతో సీఎం స్థాయి నుంచి విచారణ మొదలైంది. ఇకపోతే అందులో ఒకరికి హెచ్ఐవి సోకడం మరింత అనుమానానికి రేకెత్తించింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే...

 

 

ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. అక్కడ వసతి గృహాల్లో ఉండే ఆడపిల్లల తల్లిదండ్రుల నుంచి భయం కల్పించే ఓ విషయం వెలుగులోకి వచ్చింది. కాన్పూర్ లోని ఆశ్రమ గృహంలో ఉంటున్న మొత్తం 57 మంది బాలికలకు కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాదు, అందులో ఐదు మందికి గర్భందాల్చినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అలాగే మరొకరికి హెచ్ఐవి కూడా సోకిందని తెలిపారు. 


ఈ పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ఉన్నత అధికారులు ఆ ఆశ్రమానికి తాళం వేసి సీజ్ చేశారు. ఇకపోతే ఈ విషయంపై కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ బ్రహ్మ డియో రామ్ తివారి మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాలోని సంక్షేమ కమిటీ సిఫారసు మేరకు ఆ బాలికలను ఆ ఆశ్రమంలో ఉంచారని తెలిపారు. అయితే ఆసమయానికి కొంతమంది అమ్మాయిలు గర్భవతులుగా ఉన్నారని ఆయన తెలిపారు. ఇకపోతే ఈ విషయంపై విచారణ జరుగుతుందని, వీరందరూ కాన్పూర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: