భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య గతంకంటే రెట్టింపు స్థాయిలో పెరిగిపోతున్నాయి. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ఈ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుండటంతో ప్రభుత్వాలు, ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసిన దగ్గర నుంచి ఈ కేసుల సంఖ్య మరింతగా విజృంభిస్తోంది. రోడ్లపైకి విచ్చలవిడిగా వస్తున్న జనాలు సరైన నియమ నిబంధనలు పాటించక పోవడం కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందడానికి కారణంగా కనిపిస్తోంది. దీనికి అక్కడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడంలేదు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ నిబంధనలు విధించాలనే ప్రతిపాదనలు కేంద్రానికి అందుతున్నా, ఆ నిర్ణయం రాష్ట్రాల మీదే కేంద్రం పెట్టేసింది.

 

 దీంతో కరోనా విజృంభిస్తున్న జిల్లాలోని కొన్ని కొన్ని పట్టణాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే, ఇక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కంటే రెట్టింపు స్థాయిలో పెరిగిపోయాయి. ముఖ్యంగా పట్టణాల్లో ఈ కేసుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంటూ వస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రజాప్రతినిధులకు కూడాఈ కరోనా ఎఫెక్ట్ కు గురయ్యారు. ఇదిలా ఉంటే ఆదివారం ఒక్కరోజే తెలంగాణలో 730 కరోనా పాజిటివ్ కేసులు బయటపడడం కలకలం రేపుతోంది. రాజధాని నగరంలో ఒక రోజు 659 కేసులు నమోదయ్యాయి. గత మూడు రోజులుగా చూసుకుంటే సగటున రోజుకు 500 కేసులు తక్కువ కాకుండా నమోదవుతున్నాయి. 


హైదరాబాద్ తో మేడ్చల్, రంగారెడ్డి, జిల్లాలో ఈ కేసుల సంఖ్య పెరిగి పోతున్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో టెస్టుల సంఖ్యను పెంచారు. టెస్ట్ ల సంఖ్య పెంచడం వల్లే కేసులు బయటపడుతున్నాయి అనేది అధికారులు చెబుతున్న మాట. ఇక్కడ 14 నుంచి 21 రోజుల పాటు లాక్ డౌన్ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: