ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల లో తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీ తో రాజకీయాలు చేసి అతి తక్కువ టైమ్ లోనే జనసేన పార్టీ ప్రధాన పార్టీగా అవతరించింది. 2014 ఎన్నికల టైంలో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ సమయములో పోటీచేయకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి అవటానికి కీలక పాత్ర పోషించారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ టీడీపీ కి సపోర్ట్ చేయకపోతే మ్యాగ్జిమం జగన్ ముఖ్యమంత్రి అయ్యే వాడని చాలామంది చెబుతుంటారు. అయితే ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమి నుండి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి దారుణంగా ఓడిపోవడం జరిగింది.

 

ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రయాణం లో పవన్ కళ్యాణ్  ఎక్కువగా టార్గెట్ చేసింది… వైయస్ జగన్ ని. 2019 ఎన్నికల తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన ఎక్కడ వెనుకడుగు వేయకుండా పవన్ కళ్యాణ్ వైయస్ జగన్ ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ రాజకీయం చేశారు. అయినా ఉన్న కొద్ది వైఎస్ జగన్ కి ప్రజలలో గ్రాఫ్ పెరుగుతుండటంతో.. జగన్ ని ఢీ కొనాలంటే బీజేపీ యే కరెక్ట్ అని పవన్ భావించినట్లు, దాంతో బీజేపీతో చేతులు కలిపి మిత్రపక్షంగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నరు.

 

ఎప్పుడైతే బీజేపీ పార్టీ జనసేన తో చేతులు కలిపిందో...  అప్పటినుండి పవన్ కళ్యాణ్ రాజకీయం గా కొద్దిగా స్పీడు తగ్గించారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గత నాలుగు నెలలుగా చూసుకుంటే హైదరాబాద్ నగరానికే పరిమితమయి, సినిమాలు ఒప్పుకుంటూ వస్తున్నారు. పెద్దగా రాజకీయాలు ఏమీ చేయటం లేదు అడపాదడపా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే జనసేన పార్టీ బరువు బాధ్యతలు అంత బిజెపి మోసే విధంగా పవన్ పార్టీ క్యాడర్ విషయంలో నాయకుల విషయంలో అసలు పటించుకోవడం లేదన్న వార్తలు ఏపీ రాజకీయాలో బాగా వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: