ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కారణంగా అందరు ఇంటి నుండి బయటికి రావడానికే భయపడుతున్నారు. ఒక్క వేళా బ్యాంకుకు వెళ్లిన క్యూలో నిల్చోవాలి అంటే చాలా మంది చికాకు పడుతుంటారు. కొన్ని సార్లు బ్యాంకులో పని పూర్తి కావడానికి చాలా టైమ్ తీసుకుంటుంది.

 

 

దీంతో బ్యాంకుల్లోనే గంటలకొద్ది ఉండాల్సి వస్తున్నదన్నారు. ఇది అన్ని బ్యాంకులకు వర్తించకపోవచ్చు కానీ కొన్ని బ్యాంకుల్లో పని వెంటనే పూర్తికావొచ్చునన్నారు. కానీ చాలా బ్యాంకుల్లో మాత్రం ఇలా ఉండదన్నారు. అయితే ఇకపై కస్టమర్లు బ్యాంకుల్లో గంటలకొద్ది వేచి ఉండాల్సిన పని లేదని బ్యాంకు అధికారులు తెలిపారు.

 

 

ఫెడరల్ బ్యాంక్ తాజాగా తన కస్టమర్ల కోసం వినూత్నమైన సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. బ్యాంక్‌లో పని ఉంటే ముందుగానే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించిందన్నారు. దీంతో బ్యాంకులు వెళ్లే వారు ముందుగానే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుంటే.. వెంటనే వెళ్లి పని పూర్తి చేసుకొని రావొచ్చునని తేలిపారు.

 

 

ఇలా చేయడం వలన బ్యాంకులో క్యూ లైన్లలో నించోవలసిన పని లేదన్నారు. ఫెడరల్ బ్యాంక్ తీసుకువచ్చిన ఈ ప్రిబుక్ అపాయింట్ ‌మెంట్ సేవలను ఫెడ్‌స్వాగత్ అని పిలుస్తారన్నారు. ఇక్కడ అపాయింట్‌మెంట్ కోసం ఎలాంటి  చార్జీలు చెల్లించాల్సిన పని లేదన్నారు. అయితే ఉచితంగానే ఈ సర్వీసులు పొందొచ్చునని అధికారులు తెలిపారు. బ్యాంక్ ప్రస్తుతం 50 బ్రాంచుల్లో ఈ సర్వీసులు తీసుకువచ్చిందన్నారు. 2020 జూన్ చివరి నాటికి అన్ని బ్యాంచుల్లోనూ ఈ సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తామని బ్యాంక్ అధికారులు తెలిపారు.

 


అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలని భావించే వారు ముందుగా ఫెడరల్ బ్యాంక్ వెబ్‌సైట్‌కు వెళ్లాలన్నారు. అక్కడ ఫెడ్ స్వాగత్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చునన్నారు. మీకు ఒక ఎస్ఎంఎస్ కూడా వస్తుందన్నారు. ఇతర బ్యాంక్ కస్టమర్లు కూడా ఈ సర్వీసులు ఉపయోగించుకోవచ్చునన్నారు. కాగా రానున్న రోజుల్లో ఇతర బ్యాంకులు కూడా ఫెడరల్ బ్యాంక్ దారిలో నడిచే అవకాశముందని అధికారులు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: