దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న విషయం తెలిసిందే.  నేపథ్యంలో విద్యావ వ్యవస్థలో మునుపెన్నడూ లేని విధంగా మార్పులు తీసుకు వస్తున్నారు.  కరోనా వైరస్‌ ప్రబలడంతో పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయాలని నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వారికి ఇంటర్నల్ పరీక్షలకు వచ్చిన మార్కులను బేస్ చేసుకుని వారికి గ్రేడ్స్ ఇవ్వనున్నారు. కాగా,   పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు సోమవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. www.bse.telangana.gov.in   వెబ్‌సైట్‌లో  గ్రేడ్ల వివరాలు చూసుకోవచ్చని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

 

రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులేనని మంత్రి పేర్కొన్నారు. మెమోలు ఆయా పాఠశాలల్లో విద్యార్థులు తీసుకోవచ్చని చెప్పారు. ఏవైనా పొరపాట్లు ఉంటే పాఠశాల ద్వారా ఎస్సెస్సీ బోర్డుకు పంపాలని సూచించారు.  కరోనా పరిస్థితుల కారణంగా 2019-20 విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, అందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించి విషయం తెలిసిందే. 

 

SSC results వెబ్సైట్ లో క్రింది లింక్ ద్వారా  విద్యార్థి hall ticket no. మరియు date of birth enter చేసి ఫలితాన్ని పొందవచ్చు : 

 

పదో తరగతి విద్యార్థులు తమ తమ గ్రేడ్లను చూసుకునేందుకు మొదట bse.telangana.gov.in  లోకి లాగినై, టీఎస్‌ ఎస్సెస్సీ గ్రేడ్‌లు 2020 క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ఫలితాల పేజీ వస్తుంది. అనంతరం హాల్‌ టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ నమోదు చేసి సబ్మిట్‌ చేస్తే గ్రేడింగ్‌ను చూపిస్తుంది. వీటిని ప్రింట్‌ కూడా తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: