దేశీ అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎల్‌ఐసీ ఎన్నో రకాల పాలసీలు అందిస్తోందని ఎల్ఐసి అధికారులు తెలియజేశారు.అయితే వీటిల్లో టర్మ్ ప్లాన్లు కూడా ఉన్నాయని యాజమాన్యం తెలిపారు. టర్మ్ ప్లాన్లలో టెక్ టర్మ్ ప్లాన్ చాలా పాపులర్ అని యాజమాన్యం చెపుతున్నారు.

 

 

అయితే ఇది ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. దీన్ని ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుగోలు చేయొచ్చునని తెలిపారు. పాలసీదారుడు మరణించినప్పుడు వారి కుటుంబానికి ఈ పాలసీ ఆర్థిక భద్రత కల్పిస్తుందన్నారు. పాలసీ మెచ్యూరిటీ గడువు కన్నా ముందుగానే పాలసీదారుడు మరణిస్తే.. అప్పుడు పాలసీ డబ్బులు కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు.

 

 

కనీసం రూ.50 లక్షలకు పాలసీ తీసుకోవలసి ఉంటుంది. గరిష్ట పరితిమి అంటూ ఏమీ లేదు. పాలసీ ప్రీమియం చెల్లించేందుకు మూడు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆరు నెలలు, ఏడాది చొప్పున పాలసీ ప్రీమియం కట్టొచ్చు. లేదనుకుంటే ఒకేసారి పాలసీ ప్రీమియం చెల్లించొచ్చన్నారు.

 

 

పదేళ్ల నుంచి 50 ఏళ్ల కాల పరిమితితో పాలసీ తీసుకోవచ్చు. గరిష్టంగా 80 ఏళ్ల వరకు పాలసీ కవరేజ్ లభిస్తుందని తెలియజేశారు. సిగరెట్ తాగే అలవాటు ప్రాతిపదికన కూడా పాలసీ ప్రీమియం మారుతుందన్నారు. పొగతాగే అలవాటు ఉన్న వారికి ప్రీమియం ఎక్కువగానే ఉంటుందన్నారు. 18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు కూడా పాలసీ తీసుకోవచ్చునన్నారు. 65 ఏళ్లలోపు వయసు కలిగిన వారు పాలసీ పొందొచ్చునన్నారు.

 


అయితే 30 ఏళ్ల వయసులో ఉన్న ఒక వ్యక్తి ఎల్‌ఐటీ టెక్ టర్మ్ ప్లాన్ తీసుకుంటే.. ప్రీమియం ఎలా ఉంటుందో చూద్దాం. 30 ఏళ్ల కాల పరిమితితో రూ.50 లక్షల బీమా మొత్తాన్ని పాలసీ తీసుకున్నారు. ఇప్పుడు వార్షిక ప్రీమియం రూ.9,912 అవుతుంది. అదే కోటి రూపాయల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే సంవత్సరానికి రూ.17,445 ప్రీమియం చెల్లించాలన్నారు. అంటే రోజుకు రూ.48 ఆదా చేసుకుంటే సరిపోతుందని యాజమాన్యం వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: