జగన్ మంత్రి వర్గంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇద్దరు మంత్రులు రాజ్యసభకు వెళ్ళ్డడంతో జగన్ చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ కొత్త మంత్రులను తీసుకుంటునారు. అదే విధంగా ప్రమోషన్ల విషయంలో కూడా జగన్ సామాజిక తూకాన్ని అక్షరాలా పాటిస్తున్నారు. జగన్ క్యాబినేట్ లో సీనియర్ మంత్రిగా బీసీగా పిల్లి సుభాస్ చంద్రబోస్ ఉన్నారు. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా  కూడా ఉన్నారు.

 

ఇపుడు ఆయన రాజ్యసభకు వెళ్తున్నారు. దాంతో డిప్యూటీ సీఎం పదవి తిరిగి  బీసీ వర్గానికే ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన బీసీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి జగన్ ఈ పదవి ఇస్తున్నారని టాక్ నడుస్తోంది. యువకుడు ఉత్సాహవంతుడు అయిన అనిల్ కుమార్ జగన్ కి అత్యంత సన్నిహితుడు. జగన్ మాటే వేదంగా నడుస్తారు. ఇక జిల్లాలో కూడా ఆయన దూకుడు రాజకీయం చేస్తారని పేరు.

 

జగన్ యువ టీంలో ముందువరసలో ఉన్న అనిల్ యాదవ సామాజికవర్గానికి చెందిన వారు. రాష్ట్రంలో యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాంతో వారిని ఆకట్టుకోవాలన్న ఉద్దేశ్యం కూడా జగన్ కి ఉంది. టీడీపీలో యనమల రామక్రిష్ణుడు యాదవుల తరఫున సీనియర్ మంత్రిగా ఉన్నా కూడా ఉప ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఇపుడు జగన్ ఆ లోటు తీరుస్తూ అనిల్ కి అవకాశం ఇస్తారని అంటున్నారు.

 

దాని ద్వారా యాదవులను పూర్తిగా ఆకట్టుకోవడంతో పాటు పార్టీకో అంకితభావంతో పనిచేసేవారికి అవకాశాలు ఉంటాయని జగన్ చెప్పబోతున్నారని అంటున్నారు. ఆయన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కి కలసిన సందర్భంగా మంత్రివర్గంలో మార్పుల గురించి చర్చించి ఉంటారని భావిస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఒక వేళ డిప్యూటీ సీఎం అనిల్ ని వరిస్తే ఉప ముఖ్యమంత్రిగా యువకుడికి అవకాశం దక్కినట్లే. నెల్లూరు పాలిట్రిక్స్ లో వేడి పెరిగినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: