టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎంతటి రాజకీయ అనుభవం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు రాజకీయ ఎత్తులు పై ఎత్తులు ఎంత పకడ్బందీగా ఉంటాయి అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను... మరెన్నో రకాల ఆటుపోట్లను చూశారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి కీలక నేతగా ఎదిగి  ఏకంగా అధినేత ఎన్టీఆర్  ని పక్కకు పెట్టేసి పార్టీని కైవసం చేసుకుని ఎన్ని రోజుల వరకు సక్సెస్ఫుల్గా పార్టీని ముందుకు నడిపిస్తూ ఎక్కడ అసంతృప్తి లేకుండా సమన్వయం చేస్తూ వచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్టీని కాపాడుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు. 

 


 అయితే చంద్రబాబు నాయుడు నియోజకవర్గ స్థాయి నేతలతో కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ  శుభాకాంక్షలు తెలుపుతూ ఉండడం చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సాంప్రదాయాలను ప్రజలు గమనిస్తూనే ఉంటారు అని అంటున్నారు విశ్లేషకులు. మొన్నటికి మొన్న తెలంగాణా రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు దేశం కోసం అమరుడైన సందర్భంలో అందరిలాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఏకంగా  కల్నల్  సంతోష్ కుటుంబానికి 5 కోట్లు ఇవ్వడం ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఉద్యోగం కూడా ఇవ్వడం లాంటివి చేశారు. 

 


 అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నుంచి కూడా ఇలాంటి ఏవైనా కేటాయింపులు వస్తాయి అని అనుకున్నారు కానీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటి వరకు కల్నల్  సంతోష్ బాబు కు ఎలాంటి అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు మాత్రం హైదరాబాద్ నుంచి కల్నల్  సంతోష్ బాబు కుటుంబానికి స్వయంగా కాల్ చేసి పరామర్శించారు. అయితే ప్రతిపక్ష నాయకుడు పరామర్శించిన సందర్భంలో అధికార పార్టీ ఒక ముఖ్యమంత్రి అది తెలుగు వాడు అయి ఉండి.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఒక తెలుగు సైనికుడి  కోసం సహాయం అందించడం పరామర్శించడం అనేది బాధ్యత. ఇలాంటి విషయాల్లో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త ఆలోచనాత్మకమైన అడుగు వేస్తే బాగుంటుందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: