కేరళలో కరోనా విలయ తాండవం చేస్తుంది. గత నాలుగు రోజుల నుండి ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండగా ఈరోజు  కూడా అదే ట్రెండ్ కొనసాగింది. సోమవారం ఏకంగా 138 కేసులు నమోదయ్యాయి. ఇందులో 134 కేసులు విదేశాల నుండి  వచ్చినవే కావడం గమనార్హం. ఇప్పటివరకు సింగిల్ డే లో ఇదే హైయెస్ట్. కాగా ఈరోజు మరో 88 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. ఈకొత్త కేసులతో కలిపి కేరళలో మొత్తం 3310కేసులు నమోదుకాగా అందులో 1540కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 1747మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా 21 మంది మరణించారు. 
ఇక మిగితా దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడులో ఈఒక్క రోజే రికార్డు స్థాయిలో 2710కేసులు బయటపడ్డాయి. ఆరాష్ట్రం లో మొత్తం కేసుల సంఖ్య 62087 కు చేరింది. ఇక కర్ణాటక లో ఈరోజు 249కేసులు నమోదుకాగా ఆంధ్రప్రదేశ్ లో 443కేసులు నమోదయ్యాయి అలాగే తెలంగాణలో ఈరోజు కొత్తగా 872 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా ఇప్పటివరకు ఇండియాలో 435000కరోనా కేసులు నమోదుకాగా 13800కు పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: