సొంత పార్టీ ఎంపీ వ్యవహారం ఏపీ అధికార పార్టీ వైసీపీ కి తలనొప్పిగా మారింది. ప్రతి విషయంలోనూ తమకు ఏకు మేకల తయారయ్యాడనే భావన వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు కొద్ది రోజుల ముందు పార్టీలో చేరిన ఆయనకు టిక్కెట్ ఇచ్చి గెలిపించడమే కాకుండా, తగిన ప్రాధాన్యత ఇచ్చినా నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు ఇప్పుడు అధిష్టానంపై విమర్శలు చేస్తూ, సొంత పార్టీ కార్యకర్తల పై పోలీస్ స్టేషన్లో కేసు పెడుతూ, మీడియ ద్వారా ప్రభుత్వ తీరును ఎండగడుతూ వ్యవహరిస్తున్న తీరు వైసిపికి ఇబ్బందికరంగా మారింది. ఏపీలో తనకు రక్షణ కరువైందని, వెంటనే తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఆయన లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.


 అక్కడితో ఆగకుండా. తనను చంపేస్తానంటూ దేశ విదేశాల నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారని, రఘురామకృష్ణంరాజు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగకుండా, తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కొంతమంది వ్యవహరించిన తీరుపైన, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదని జిల్లా ఎస్పీ కి సైతం రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రఘురామ కృష్ణంరాజు బీజేపీ లోకి వెళ్లేందుకే ఇంత హడావుడి చేస్తున్నారని, వైసిపి చెబుతున్నా, ఆయన వైసీపీ పై చేసిన విమర్శలు ఆ పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాయి. ఆయన చేస్తున్న విమర్శలను సరైన రీతిలో అడ్డుకోకపోతే, వైసీపీకి చాలా డ్యామేజ్ అయ్యే అవకాశమే కనిపిస్తోంది.

 


 ప్రభుత్వం నిజంగానే కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే అనుమానాలు కూడా జనాల్లోకి వెళ్లిపోతాయి. ఇప్పటికే ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని వైసీపీ అధిష్టానం డిసైడ్ అయినట్లు గా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు అటువంటి నోటీసులు ఆయనకు అందినట్టుగా కనిపించకపోవడంతో మరింతగా వైసీపీ పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారానికి జగన్ ఏవిధంగా పులిస్టాప్ పెడతారనే ఉత్కంఠ ప్రస్తుతం వైసీపీలో నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: