కరోనా వైరస్ ఇండియాలో భయంకరంగా వ్యాప్తి చెందుతున్న విషయం అందరికీ తెలిసిందే. అనవసరంగా లాక్ డౌన్ తీసేసి నట్లు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పై ప్రజలు మండిపడుతున్నారు. కారణం చూస్తే రోజుకి కనీసం పది వేలకు పైగానే కొత్త పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా బయటపడటం. గతంలో లాక్ డౌన్ అమలు చేస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మహా అయితే 2000 బయటపడేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోవడంతో పాటుగా కరోనా వైరస్ చికిత్స చేస్తున్న వైద్యులకు మరియు పోలీసులకు అదేవిధంగా పొలిటికల్ లీడర్ లకు కరోనా సోకుతుండటంతో ప్రభుత్వ వర్గాల లో సామాన్యులలో కూడా టెన్షన్ మొదలైంది.

 

ఇదే సమయంలో ఇటీవల మీడియా ప్రతినిధులకు కూడా కరోనా సోకుతుండటంతో మీడియా వర్గాలలో కూడా టెన్షన్ మొదలైంది సరికొత్త కరోనా న్యూస్ ఇప్పుడు తెలుగు రాజకీయాల లో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఇటీవల హైదరాబాద్ నగరంలో తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ మీడియా కార్యాలయంలో దాదాపు 125 మందిలో 17 మందికి కరోనా పాజిటివ్ రావటంతో ఆ కుటుంబాలను క్వారంటైన్ కి తరలించారు. అంతేకాకుండా మెయిన్ ఆఫీస్ ని క్లోజ్ చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఈ 17 మంది ఎవరితో కాంటాక్ట్ అయ్యారు అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది.

 

దీంతో ఈ వార్త తెలుసుకుని మీడియా సంస్థ రిపోర్టర్లు ప్రతినిధులు తమ కార్యాలయాలకు వెళ్ళటానికి భయపడుతున్నారని వరుసగా సెలవులు పెడుతున్నట్లు మీడియా వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరోపక్క ఇదే టైం అనుకొని కొన్ని పత్రిక కార్యాలయాల యాజమాన్యాలు పత్రికలో పనిచేసే జర్నలిస్టుల ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. దీంతో జర్నలిస్టులు అటు కార్యాలయాలకి వెళ్ళలేక ఇటు ఉద్యోగాలు కోల్పోలేక సతమతమవుతున్నరట. 

మరింత సమాచారం తెలుసుకోండి: