కరోనా వైరస్ నియంత్రించేందుకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ లాక్ డౌన్ విధించిన సమయం నుండి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగాయి. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా మూడు నెలల పాటు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగాయి. అప్పుడే అనుకున్నారు అందరూ.. 

 

ఒక్కసారి లాక్ డౌన్ ఎత్తేస్తే... పెట్రోల్, డీజిల్ ధరల ప్రతాపం ఏంటో చూపిస్తుంది అని మార్కెట్ నిపుణులు చెప్పేవారు. ఇంకా ఇప్పుడు అలానే దాని ప్రతాపం చూపిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహము లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు గత 15 రోజులుగా చుక్కలు చూపిస్తుంది. అతి దారుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లోను ముడి చమురు ధరలు తగ్గాయిని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

 

ఇంకా ఈరోజు సోమవారం లీటరు పెట్రోల్ ధర 40 పైసలు పెరుగుదలతో రూ.83.09 పైసలకు, డీజిల్ ధర 57 పైసలు పెరుగుదలతో రూ.76.89 పైసాలకు చేరింది. ఇంకా అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే కొనసాగుతుంది. పెట్రోల్‌ ధర 53 పైసలు పెరుగుదలతో రూ.81.79కు, డీజిల్‌ ధర కూడా 64 పైసలు పెరుగుదలతో రూ.75.88కు చేరింది.                             

 

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర 65 పైసలు పెరుగుదలతో రూ.78.41కు, డీజిల్ ధర కూడా 64 పైసలు పెరుగుదలతో రూ.76.43కు చేరింది. ఇలా గత పదిహేను రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయ్. మరి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి.                    

మరింత సమాచారం తెలుసుకోండి: