భూమిపై పెట్టుబడి ఎప్పటికీ మంచిదేనని పెద్దలు చెబుతారు. అందుకే చాలా మంది ఏమాత్రం వెసులుబాటు ఉన్నా.. ఇళ్లస్థలమో.. ఇల్లో కొంటుంటారు. పిల్లల భవిష్యత్ కోసం కూడా స్థలాలు కొనిపెడుతుంటారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి హైదరాబాద్ లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ తర్వతా మోడీ పెద్ద నోట్ల రద్దుతో ఈ జోరు మరింత పెరిగిపోయింది.

 

 

భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు కరోనా కారణంగా హైదరాబాద్ లో భూములు రేట్లు తగ్గాయంటున్నారు రియల్ ఎస్టేట్ విశ్లేషకులు. వచ్చే అక్టోబరు, నవంబరు నాటికి సాధారణ స్థాయికి స్థిరాస్తి రంగం వస్తుందంటున్నారు. కొవిడ్‌ సంక్షోభం వల్ల పరిశ్రమల పెట్టుబడులు భూములపై తగ్గుతాయని... తద్వారా భవిష్యత్తులో భూముల ధరలు తగ్గవచ్చని చెబుతున్నారు.

 

 

కొవిడ్‌ సంక్షోభంతో గత మూడు నెలలుగా స్థిరాస్తి రంగ కార్యకలాపాలన్నీ దాదాపు స్తంభించాయని నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయం తరువాత అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగమిదేనని.. వలస కూలీలు వెళ్లిపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని వివరిస్తున్నారు.

 

 

అందుకే భూమిపై పెట్టుబడి పెట్టదలచుకున్న వారికి ఇది మంచి అవకాశమని చెబుతున్నారు. అయితే కేవలం ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములు మాత్రమే కొనుక్కోవచ్చని సూచిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవనాలు, అపార్ట్ మెంట్ల రేట్లు మాత్రం తగ్గవని సలహా ఇస్తున్నారు. హైదరాబాద్‌లో భూములు తక్కువ ధరకు దొరుకుతాయని.. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది ఇక్కడకు వస్తున్నారని చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: