ప్రపంచంలో ఇప్పుడు కొన్ని కోట్ల మంది ప్రజలు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్న వార్త ఏంటంటే.. కరోనాకు మందు ఎప్పుడు వస్తుంది అని.. ఇలా ఆలోచించినట్లుగానే కరోనా విషయంలో ఏదో ఒక వార్త ఈ వైరస్ బారిన పడిన వారికి ఊరటకలిగించేలా బయటకు వస్తుంది.. కానీ ఇందులో ఉన్న నిజనిజాలు ఎంతో తెలవదు గానీ ఒక్కోసారి అబద్ధపు ప్రచారాలు కూడా కరోనా వ్యాక్సిన్ విషయంలో జరుగుతున్నాయని అనుకుంటున్నారు.. ఒకరకంగా కరోనా మందు వచ్చిందనేది ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది.. అదే సమయంలో కొందరిలో నిర్లక్ష్యాన్ని కూడా పెంచుతుంది అనే వాదన వినిపిస్తుంది..

 

 

ఇకపోతే కరోనాకు మందు వచ్చిందని విచ్చల విడిగా రోడ్ల పై మాత్రం తిరగకండి.. ఇక ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన కరోనా మందు విషయాన్ని తెలుసుకుంటే.. ఆ టాబ్లెట్స్ పేరు ఫాబీఫ్లూ టాబ్లెట్స్ అంటారు.. మరి ఈ మందు కరోనా పేషెంట్స్ మీద ఎంతవరకు పని చేస్తుందనే విషయాన్ని పరిశీలిస్తే.. ఫాబీఫ్లూ టాబ్లెట్స్ తక్కువ మోస్తారు కరోనా లక్షణాలు ఉన్న పేషంట్స్ కి మాత్రమే పనిచేస్తాయట.. సీరియస్ కేసుల్లో పనిచేయదట.. అదీగాక ఫాబీ ఫ్లూ టాబ్లెట్ రేటు సుమారుగా రూ 103 అనుకుంటే, వారు చెప్పే డోసుల ప్రకారం 14 రోజులకి కలిపి 14 వేల చిల్లర అవుతుంది.... 14 రోజుల తరువాత కంటిన్యూగా మరో 12 రోజులు వేసుకోవాలట.. అంటే మైల్డ్ గా కరోనా లక్షణాలు ఉంటే 20 వేల చిల్లర ఖర్చు అవుతుందన్న మాట.. అందులో కరోనా టెస్టులకు డబ్బులు అదనంగా ఉంటాయి..

 

 

ఇక ఇక్కడ మీకు తెలియని మరో సీక్రేట్ ఏంటంటే.. 90% కరోనాపేషంట్స్ వారం, పదిరోజుల్లోనే ఆస్పత్రిలో ఇచ్చే పారాసిట్మాల్, అజిత్రోమైసిన్, హైడ్రోక్లోరోక్విన్, బీ కాంప్లెక్స్ లాంటి టాబ్లెట్స్ వల్ల పూర్తిగా కోలుకున్నారట.. ఈ ‌మెడిసన్ ఖరీదు మొత్తం 14 రోజులకి కలిపి రూ 1000 కూడా అవ్వదు.. మరి ఇందులో ఏది బెటర్.. ఇంకో విషయం ఏంటంటే.. ఈ మందుకు పుట్టినిల్లు ఐన జపాన్ లో ఇంకా అనుమతి లభించలేదట. అమెరికాలో కూడా అంగీకరించలేదు. కానీ భారత్ లో మాత్రం అనుమతి రాగా, దీనికి తోడు మీడియాలో మనిషికి సంజీవని దొరికేసింది అన్న స్థాయిలో ప్రచారాలు చేస్తున్నారు..

 

 

ఇకపోతే మామూలుగానే జనం కరోనా ఉన్న సమయంలోనే దేన్ని పట్టించుకోకుండా ప్రవర్తించారు.. ఇక మందు వచ్చింది అని హడావుడి చేస్తే, అసలు వారిలో భయమే వుండదేమో.. ఒకరకంగా మనం కరోనా విషయంలో మోసపోతున్నామని తెలియకుండానే మోసపోతున్నాం.. ఆ నిజాన్ని ముందుగా గ్రహించండని కొందరు చెప్పకనే చెబుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: