నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులను చూస్తుంటే ప్రజల్లో ఉన్న నిర్లక్ష్యం సృష్టంగా కనిపిస్తుంది.. చావు ఎదురుగా వస్తేనే భయపడని మన ప్రజలు చాటుగా దెబ్బతీస్తున్న కరోనాకు ఇంకేం భయపడతారు.. అందుకే ఈ వైరస్‌ను విచ్చలవిడిగా వ్యాపింప చేస్తున్నారు.. ఇప్పటికే జనం గుంపులు గుంపులుగా ఉండకండి, తిరగకండని చెబితే ఏ ఒక్కరైనా వింటున్నారా.. ఫంక్షన్లు అని, పార్టీలు అని ఒకరి మధ్య ఒకరికి గ్యాప్ లేకుండా మెదులుతున్నారు.. అంతే కాకుండా రద్దీ ప్రదేశాలకు వెళ్లొద్దని, వెళ్లినా ఎడం పాటించాలని అధికారులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా కనీస పరిశుభ్రత లేని చోట కూడా అల్పాహారాల కోసం జనం క్యూ కడుతున్నారు.

 

 

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఓ చాట్‌ భండార్‌ యజమానికి కరోనా పాజిటీవ్ వచ్చింది.. దీంతో చిరుతిళ్ల స్టాళ్లు, పానీపూరి బండ్ల వద్ద పరిశుభ్రతపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత స్పష్టంగా కన్పిస్తోంది. అదీగాకుండా విజయవాడ మాచవరంలోని ఓ టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకుడి వల్ల ఏకంగా 30 మందికి కొవిడ్‌-19 వైరస్‌ సంక్రమించిన విషయం తెలిసిందే.. ఇలాంటి ఘటనలు నగరవాసులకు చిరుతిళ్ల వ్యాపారాల వద్ద ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పుతున్నాయి.. అయినా ఉదయం పూట టిఫిన్‌ సెంటర్లు, సాయంత్రం పూట చిరుతిళ్ల దుకాణాలకు జనాలు ఎగబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అంతే కాకుండా నగరంలో వర్షాలు ప్రారంభమయ్యాయి. కాలానుగుణ వ్యాధులతో పాటు కరోనా విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

 

ఇక మద్యం దుకాణాల వద్ద కనిపించే జనాన్ని చూస్తే అసలు వీరికి ఒంట్లో భయం ఉందా. వీరు చచ్చేది గాక వీరి వల్ల కుటుంబసభ్యులు, బందువులు, చుట్టుపక్కలి వారికి కూడా ప్రమాదం తప్పదు అనే స్దాయిలో వ్యవహరిస్తున్నారు.. ఎందుకంటే మద్యం దుకాణాల వద్ద నిర్వహించే చిరుతిళ్ల స్టాళ్లు చూస్తే వాంతులు వస్తాయి. వణుకు పుడుతోంది.ఇక్కడ మద్యం కొనుగోలు చేసిన అనంతరం  మందుబాబులు వీటి వద్ద గుమిగూడుతున్నారు. ఎక్కడా భౌతిక దూరం పాటించడం లేదు. మురికి వాతావరణం ఉన్నా పట్టించుకోకుండా ఆహారాన్ని తీసుకెళ్తున్నారు. అందులో ఇప్పుడు ఈగలు ముసిరే కాలం. ఇలా ఎవరికి వారు కరోనా వైరస్‌ను వ్యాపింపచేయడంలో ముఖ్యపాత్రను పోషిస్తూ ఇతరులను నిందించడం సరికాదు.. అందుకే మీ చావు మీరు చావండని అధికారులు కూడా చేతులు ఎత్తేస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: