ముఖ్యమంత్రి జగన్ ఈరోజు 10:30 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సచివాలయానికి రానున్నారు. ఇటీవల జరిగిన కార్యక్రమంలో ‘స్పందన’ నుంచి  వచ్చే వినతుల్లో 90 శాతం పరిష్కారమవుతున్నాయని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ కర్యక్రమంలో నేరుగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు.  ప్రజలు మనల్ని నమ్ముకొని ఓట్లు వేశారు.. వారికి ఎలాంటి కష్టం రాకుండా ప్రజా ప్రతినిధులు, అధికారులు చూసుకోవాల్సిన బాధ్యత అని ఈ సందర్బంగా పలు మార్లు తెలియజేశారు సీఎం జగన్.  ఇక మహిళల కోసం మరో జగన్ సర్కార్ మరో వినూత్న పథకం తీసుకొచ్చింది.

 

'వైఎస్సార్‌ కాపు నేస్తం' అనే పథకం ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి 15వేల రూపాయల చొప్పున 5 ఏళ్లలో మొత్తం 75 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారు. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.353.81 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈనెల 24 బుధవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. 2019–20కి సంబంధించి ఈనెల 24వ తేదీన ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

 

ఈ ఏడాది లబ్ధిదారులకు నేరుగా వారి వారి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు. ఈ పథకం ద్వారా 2.36 లక్షల మహిళలకు లబ్ధిపొందనున్నరు. ఇక ఉదయం 11 గంటలకు ఇన్ఫర్మేషన్ కమిషన్ సెలెక్షన్ కమిటీ మీటింగ్‌లో సీఎం పాల్గొననున్నారు. అనంతరం 11.30 నుండి 1 గంట వరకు ‘స్పందన’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తిరిగి ఒంటిగంటకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి సీఎం వెళ్లనున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: