ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు ఇప్ప‌టికే 91 ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి. మ‌రో రెండు మూడు రోజుల్లో ఈ సంఖ్య కోటి దాటిపోనుంది. ఇదిలా ఉంటే మ‌న దేశంలోనూ క‌రోనా నిమిషం నిమిషానికి విజృంభించుకుంటూ దూసుకు వెళుతోంది. ఈ క్ర‌మంలోనే దేశంలో ఏయే రాష్ట్రాల్లో క‌రోనా ప్ర‌మాద క‌ర ప‌రిస్తితుల్లో ఉందో.. ఎక్క‌డ ఎంత శాతం ఉందో ఇండియా డాట్‌ ఇన్‌ పిక్సెల్స్‌ సంస్థ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఏపీలో కమ్యూనిటీ స్ప్రెడ్‌ కు అవకాశం 8 శాతంగా ఉంది. కర్నాటకలోనూ 8 శాతంగా ఉంది.

 

దీనిని బ‌ట్టి చూస్తే ఏపీలో క‌రోనా అంత ప్ర‌మాద క‌ర ప‌రిస్థితుల్లో లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక తెలంగాణ‌, ఢిల్లీలో క‌రోనా అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో ఉంది. మ‌న‌దేశంలోనే ముందుగా ఢిల్లీ, ఆ తర్వాత తెలంగాణలో మాత్రం భారీగా కమ్యూనిటీ స్ప్రెడ్‌ ఉన్నట్టు నివేదిక చెబుతోంది. ఢిల్లీలో ఈ శాతం 143 గా ఉంది. తెలంగాణలో కమ్యూనిటీ స్ప్రెడ్‌ 122 శాతంగా ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర 65 శాతం, తమిళనాడు 38 శాతంగా ఉంది.

 

విచిత్రం ఏంటంటే దేశంలోనే ఎక్కువ కేసులు ఉన్న మ‌హారాష్ట్ర‌లో ఈ సామాజిక వ్యాప్తి కేవ‌లం 65 శాతం ఉంటే.. తెలంగాణ‌లో ఇది ఏకంగా 122 శాతం ఉంది. ఇక ఇక్క‌డ క‌రోనా ప‌రీక్ష‌లు చాలా త‌క్కువుగా ఉన్నాయి. రేపో మాపో ఏపీలోలా టెస్టుల సంఖ్య పెంచితే అస‌లు ఇంకెన్ని కేసులు బ‌య‌ట‌కు వ‌స్తాయో ? అన్న ఆందోళ‌న ఇప్పుడు అంద‌రిలోనూ ఉంది. ఇక  దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో సామాజిక వ్యాప్తి చూస్తే రాజస్తాన్, పశ్చిమబెంగాల్‌ 24 శాతం, తమిళనాడు 38 శాతాలతో క‌రోనా వ్యాప్తికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ లిస్టులో ఏపీ క‌రోనా వైర‌స్ వ్యాప్తి కోణంలో చూస్తే లీస్ట్ ప్లేస్‌లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: