ఇటీవల దేశంలో కరోనా వైరస్ ప్రబలి పోతుందని లాక్ డౌన్ ప్రకటించారు. దాంతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఇంటి పట్టున ఉండే పరిస్థితి నెలకొంది. ఎవరైనా బయటకు రావాలన్నా పోలీసుల బాధతో నానా తంటాలు పడాల్సి వచ్చింది.  ఈ సమయంలో దేశ వ్యాప్తంగా క్రైమ్ రేటు చాలా వరకు తగ్గిందని పోలీస్ అధికారులు అన్నారు. ఈ మద్య మళ్లీ నేరస్థులు తెగ రెచ్చిపోతున్నారు. లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి తమ నేరాలు మొదలు పెట్టారు. తాజాగా బీహార్ రాజధాని పట్నాలో భోజ్‌పురి గాయకుని హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. పట్నాకు స‌మీపంలోని సచే జానిపూర్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలోగ‌ల‌ సిమ్రా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  గత కొంత కాలంగా యువ గాయకుడిగా ఎంతో మంది పేరు తెచ్చుకుంటున్నాడు.

 

ఈ నేపథ్యంలోనే రంజన్ కుమార్ సింగ్(26)‌ను దారుణంగా గొంతు కోసి హ‌త్య‌చేశారు. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో కొంత‌మంది రంజ‌న్ కుమార్‌ ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చి, ఆయ‌న‌ను బయటకు తీసుకువెళ్లి హ‌త్య చేశార‌ని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.  ఎన్‌హెచ్‌-98 సమీపంలో ఇసుకదిబ్బ‌పై రంజ‌న్‌ మృతదేహం లభించింది.  అతని ఎదుగుదలను నచ్చని కొంత మంది కక్ష కట్టి మట్టు పెట్టినట్టు సందేహాలు కలుగుతున్నాయి.

 

ఈ విషయం గురించి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. రంజన్‌కు 10 రోజుల క్రితం చంపేస్తామంటూ కొంద‌రి నుంచి బెదిరింపులు వచ్చాయి. భోజ్‌పురి గాయకుని హత్యతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.  కాగా, హత్య విషయం తెలుసుకున్న జానిపూర్ పోలీసులు చేరుకున్నారు. త‌న కుమారునికి ఎదురైన బెదిరింపుల గురించి పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా, వారుప‌ట్టించుకోలేద‌ని మృతుని తండ్రి ఆరోపిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: