దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. దాని కొంత వరకు అయినా అరికట్టడానికి దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి విదితమే. ఈ కష్టకాలంలో డబ్బు సంపాదించాలని ఆలోచిస్తున్నారా..? అయితే చేతిలోని ఉన్న డబ్బుతోనే అదిరిపోయే రాబడి పొందాలని అనుకుంటున్నారా? అయితే అందుకు మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు.

 

 

అయితే నెలకు రూ.10,000తో అంటే రోజుకు దాదాపు రూ.330 పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పియస్), ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్ ) ఇన్వెస్ట్ చేయడం వల్ల కోటీశ్వరులు కావొచ్చునని అధికారులు తెలుపుతున్నారు. అయితే తాజాగా వేటిలో డబ్బులు పెడితే తొందరగా కోటీశ్వరులు అవుతారో ఒక్కసారి తెలుసుకొందాం మరి.

 

 

అయితే పీపీఎఫ్ అనేది చాలా పాపులర్ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం పీపీఎఫ్‌ ఖాతాపై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోందన్నారు. అయితే దీని ప్రకారం.. మీరు కోటి రూపాయలు సంపాదించాలని భావిస్తున్నా.. ఇది పూర్తి కావడానికి 28 ఏళ్లు పడుతుందన్నారు.

 


మీరు ఈ కాలంలో ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ.33 లక్షలు అవుతుందన్నారు. ఇక మిగతా మొత్తం వడ్డీ రూపంలో వస్తుందన్నారు. ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరడం వల్ల కూడా కోటశ్వరులు అవ్వొచ్చునన్నారు. ఎన్‌పీఎస్ ఫండ్ గత పదేళ్ల సగటు వార్షిక రాబడి 10 శాతంగా ఉందన్నారు. దీని ప్రకారం చూస్తే మీరు కోటి రూపాయలు సంపాదించాలంటే 23 ఏళ్లు పడుతుందన్నారు.

 

 

అయితే ఇక చివరిగా మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు అని నిపుణులు తెలిపారు. దీర్ఘకాలంలో ఆకర్షణీయ రాబడి పొందాలని భావించే వారు ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. లాంగ్ టర్మ్‌లో ఇండెక్స్ ఫండ్స్ 12 శాతం వరకు రాబడి అందిస్తాయి. దీని ప్రకారం చూస్తే రూ.కోటి సంపాదించాలని భావిస్తే 20 ఏళ్లు పడుతుందనట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: