ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆయన రహస్యంగా బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, ఏపీ మాజీ మంత్రి బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస రావు తో  హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో రహస్యంగా భేటీ కావడం, దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై బీజేపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అటువంటి వ్యక్తితో బిజెపి నాయకులు రహస్యంగా భేటీ అవ్వడం, ఈ వ్యవహారంలో తెలుగుదేశంతో పాటు బీజేపీ పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో బిజెపి కీలక నాయకుడు ఒకరు స్పందించారు. 


అధిష్టానం ఈ వ్యవహారంపై అసంతృప్తిగా ఉందనే విషయాన్ని వెల్లడిస్తున్నారు. నిమ్మగడ్డ వ్యవహారంపై బహిరంగంగా తమ పార్టీ నాయకులను పోరాటం చేయాలని చెప్పమని, కానీ ఈ విధంగా కుట్రలు చేయాలని బీజేపీ అధిష్టానం చెప్పలేదని, అసలు రాజకీయ నేతలతో చర్చించాల్సిన అవసరం రమేష్ కుమార్ కు ఎందుకు వచ్చింది అంటూ సదరు బిజెపి సీనియర్ నాయకుడు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ అధిష్టానం పాత్ర ఏమీ లేదని, ఆయన క్లారిటీ ఇచ్చారు. మొదటి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం పై బీజేపీ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తోందని, ఇప్పుడు ఈ విధంగా ఆధారాలతో దొరికిపోవడంతో అది నిజమనే వాదన బలపడుతోంది అని ఆయన చెప్పుకొచ్చారు.


 ఈ వ్యవహారంపై ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ కానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గాని స్పందించక పోవడం చూస్తుంటే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటూ వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. తాము మొదటి నుంచి నిమ్మగడ్డ వ్యవహారంపై ఆరోపణలు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఇప్పుడు ఆధారాలతో సహా బయట పడిందని చెప్పుకొస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: